
స్వశక్తి సంఘాలకు శిక్షణ
జగిత్యాలరూరల్: స్వశక్తి సంఘాల పుస్తకాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఐకేపీ ఏపీడీ చరణ్‌దాస్ అన్నారు. జగిత్యాల మండల ఐకేపీ కార్యాలయంలో స్వశక్తి సంఘాల ఆడిట్, సీఆర్పీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర గ్రామీణ, పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి సంఘాల సంఖ్యను బట్టి నలుగురు నుంచి ఐదుగురు సీఆర్పీలను ఎంపిక చేసి వారికి ఐదురోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. రెండు రోజులు ఏదైనా గ్రామంలోని స్వశక్తి సంఘాల పుస్తకాల పరిశీలన, ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ చేసి నివేదిక తయారు చేయిస్తామని వెల్లడించారు. ఫైనాన్స్ డీపీఎం విజయభారతి, ఐబీ డీపీఎం మానిక్‌రెడ్డి, మార్కెటింగ్ డీపీఎం మల్లేశం, ఏపీఎం గంగాధర్, జిల్లా డీఎంజీలు దేవయ్య, దాస్, సంతోష్, అకౌంటెంట్ పద్మ పాల్గొన్నారు.