చివరి గింజ వరకు కొంటాం
కథలాపూర్/మేడిపల్లి: అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలం బొమ్మెనలో ఉపాధి నిధులు రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. ఏఎంసీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం మేడిపల్లి, భీమారం మండలాల్లోని వల్లంపల్లి, మన్నెగూడెం, ఈదులలింగంపేటలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రూ.1.89కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్, వైస్ చైర్మన్ మిట్టపల్లి రాజరెడ్డి, అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, రమేశ్‌రెడ్డి,నాగరాజు, నరేష్, కొమురయ్య, వెంకటేశం ఉన్నారు.


