వినతుల వెల్లువ
● ప్రజావాణికి అర్జీదారుల క్యూ ● ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి ● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణికి వినతులు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో బాధితుల నుంచి అధి కారులు ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన పలువురు వివిధ సమస్యలపై 40 ఫిర్యాదులు అందించారు. వాటిని స త్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసుదన్‌గౌడ్, జివాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


