ఇప్పటికీ నార్లు పోయలేదు
గంగనాల ఆయకట్టుకు నీరు రాక ఇప్పటివరకు నార్లు పోయలేదు. నీళ్లు వస్తాయనే ఆశతో వడ్లను నానబెట్టిన. కనీసం అలకడానికి నీరు లేక మొలకెత్తిన వడ్లు పారబోశాను. వాస్తవానికి ఇప్పటికే నాట్లు పడాల్సి ఉంది. నీరు లేకనే ఇబ్బంది పడుతున్నాం.
– గుజ్జె గంగాధర్, రైతు, వేములకుర్తి
సమస్య పరిష్కరించాలి
సదర్‌మట్ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి గంగనాలకు నీరు రావడం లేదు. రైతులందరం ఇబ్బంది పడుతున్నాం. గంగనాలకు నీరు విడుదల చేసేలా అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలి. లేకుంటే ఆయకట్టు బీడుగా మారి రైతులు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది.
– దొనికెన రాజేశ్, రైతు, వేములకుర్తి
ఇప్పటికీ నార్లు పోయలేదు


