ముసాయిదానే.. తుది జాబితా | - | Sakshi
Sakshi News home page

ముసాయిదానే.. తుది జాబితా

Jan 14 2026 10:00 AM | Updated on Jan 14 2026 10:00 AM

ముసాయ

ముసాయిదానే.. తుది జాబితా

● మెట్‌పల్లి మున్సిపల్‌లో 26వార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాలపై 90వరకు అభ్యంతరాలు వచ్చాయి. ● ప్రధానంగా ఒక వార్డుకు చెందిన వందలాది ఓట్లు మరో వార్డులో చేర్చారు. ఇలా పలు వార్డుల్లో జరిగింది. వీటిని సవరించాలని పలువురు నాయకులు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ● వీటిపై వార్డు అఫీసర్లు, బిల్‌ కలెక్టర్లతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించారు. ● ఆ పరిశీలనలో తేలిన తప్పులను సరిదిద్ది తుది జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా తప్పులతోనే తుది జాబితా ప్రకటించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ● 18, 26, 4, 6 తదితర వార్డులకు సంబంధించిన జాబితాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయని చెబుతున్నారు. ● అభ్యంతరాలను పట్టించుకోకుండా తుది జాబి తాను ప్రకటించడంపై బీజేపీ నాయకులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ● బీజేపీ అభ్యర్థుల గెలుపును అడ్డుకునేందుకు అధికార పార్టీ ఒత్తిళ్లతో జాబితా రూపకల్పనలో అధికారులు నిబంధనలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మెట్‌పల్లి పట్టణంలోని 26 వార్డుకు చెందిన సుమారు 140 మంది ఓటర్లను 21 వార్డులో చేర్చారు. ఓటరు ముసాయిదా జాబితాలో దీనిని గుర్తించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్‌ వాటిని 26వార్డులో చేర్చాలని అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రక్షేతస్థాయిలో పరిశీలించిన మున్సిపల్‌ అధికారులు.. వాటిని సరి చేస్తున్నట్లు అతడికి సమాచారమందించారు. తీరా తుది జాబితాలో కూడా అవి 21 వార్డులోనే ఉన్నాయి.

ఇదే పట్టణంలోని 25వార్డుకు చెందిన 306 మంది ఓటర్లను 18వార్డులో చేర్చినట్లు ముసాయిదాలో గమనించిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ చెట్లపల్లి సుఖేందర్‌.. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని తొలగించాలని కోరారు. అయినప్పటికీ ఆ ఓటర్లు 18వార్డులోనే ఉన్నట్లు తుది జాబితాలో చూపారు. ఆ వార్డులో 1666 ఓటర్లు ఉంటే ఆ సంఖ్య 1972 పెరిగిందని, దీని వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.

అభ్యంతరాలను పట్టించుకోలేదని ప్రతిపక్షాల ఆరోపణ తప్పులతోనే జాబితా రూపొందించారని ఆగ్రహం మెట్‌పల్లి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన

మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపల్‌ ఓటరు తుది జాబితా తప్పుల తడకగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొదట విడుదల చేసిన ము సాయిదా జాబితాలోని తప్పులను సరిదిద్దడానికి అభ్యంతరాలు స్వీకరించారు. కానీ.. అభ్యంతరాల ను ఏమాత్రం సవరించకుండానే అధికారులు తుది జాబితాను ప్రకటించడంపై ప్రతిపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును ని రసిస్తూ మంగళవారం బీజేపీ నాయకులు మున్సి పల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

పరిశీలించారు..వదిలేశారు

మున్సిపల్‌ ఎదుట ఆందోళన

గెలవద్దనే కుట్ర

పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీ బలంగా ఉంది. ఈ ఎన్నికల్లో గెలవకుండా వాటిల్లో వందలాది ఓటర్లను తొలగించడం.. లేకుంటే పక్క వార్డులకు సంబంధించిన ఓటర్లను చేర్చడం జరిగింది. ఇదంతా కుట్రపూరితంగా చేశారు.

– చెట్లపల్లి సుఖేందర్‌, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌

చర్యలు తీసుకోవాలి

ఓటరు జాబితా తయారీలో నిబంధనలు పాటించలేదు. 26వార్డు జాబితాలో తప్పులను అధికారుల దృష్టికి తీసుకపోతే సరి చేయలేదు. ఇలా పలు వార్డుల్లో జరిగింది. ఉన్నతాధికారులు వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి.

– బొడ్ల రమేశ్‌, బీజేపీ పట్టణాధ్యక్షులు

ముసాయిదానే.. తుది జాబితా1
1/2

ముసాయిదానే.. తుది జాబితా

ముసాయిదానే.. తుది జాబితా2
2/2

ముసాయిదానే.. తుది జాబితా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement