అభ్యంతరాల వెల్లువ
జగిత్యాల: జగిత్యా ల బల్దియాలో ఓట రు జాబితా అస్తవ్యస్తంగా రూపొందించారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించా రు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఓటరు తుది జాబితా సోమవారం ప్రకటించిన విషయం తెల్సిందే. ముందుగా అభ్యంతరాలు స్వీకరించగా జగిత్యాలలో 108, కోరుట్లలో 64, మెట్‌పల్లిలో 71, ధర్మపురిలో 45, రాయికల్‌లో 51 వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు సరిచేసి తు ది జాబితా ప్రకటించారు. ఇందులోనూ తప్పులున్నట్లు ఇటు ఎమ్మెల్యే, జీవన్‌రెడ్డి ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించామని, ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్నామని అంటున్నారు.
అనుకూలంగా చేసుకున్నారని..
రాజకీయ పలుకుబడి ఉపయోగించి వారికి సంబంధించిన వార్డుల్లో ఓటర్లను అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలున్నా యి. కొన్ని వార్డులను వేరే వార్డులకు మార్చారని ఆరోపణలు వస్తున్నాుు. మరణించిన వారి ఓట్లు వెంటనే తొలగించాలని కోరుతున్నారు.


