ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలి
జగిత్యాల: సంక్రాంతి పండుగతో ప్రతి ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలని, ఆయురారోగ్యాలు నిండాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆకాంక్షించారు. కొత్త ఆశలతో ప్రజలు కొత్త జీవితంలు ప్రారంభించాలన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆనందంగా జరుపుకొంటూనే భద్రత నియమాలు పాటించాలన్నారు. సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
నృసింహుడి సన్నిధిలో జిల్లా జడ్జి పూజలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని జిల్లా జడ్జి రత్నపద్మావతి మంగళవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయం పక్షాన మేళతాళాలతో స్వాగతం పలికారు. అర్చకులు స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలు అందించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సిబ్బంది తదితరులున్నారు.
నిర్వాసితులకు పరిహారం పెంచి ఇవ్వండి
కథలాపూర్: సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న తమకు పరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండలంలోని తాండ్య్రాల రైతులు కోరుట్ల – వేములవాడ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. తాండ్య్రాలలో 40.13 ఎకరాల భూమి కాలువ పనుల్లో కోల్పోతున్నామని, ప్రభుత్వం ఎకరాకు రూ.10.80లక్షల పరిహా రం ఇస్తామంటున్నా.. అది ఎటూ సరిపోదని పేర్కొన్నారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేకుంటే ఎకరాకు రూ.50లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సై నవీన్‌కుమార్ చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
కాంగ్రెస్ జెండా మోసిన వారికే టికెట్లు
రాయికల్: కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని, బల్దియాలో జోన్లు, తైబజార్ ఎత్తివేస్తామని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ము న్సిపల్ ఎన్నికలపై పట్టణంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఎప్పుడూ పార్టీ జెండా ఎత్తని వారు అంతర్గత విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. బల్ది యాపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి జోన్ల వ్యవ స్థ, తైబజార్‌ను ఎత్తివేస్తామని తెలిపారు. రూ. 5 కోట్లతో ఫిల్టర్‌బెడ్ మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలు తమ పక్షానే ఉ న్నారని, అవకాశవాదుల పక్షాన లేరని తెలిపా రు. మంత్రి అడ్లూరి చొరవతో బోర్నపల్లి, జగన్నాథపూర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.18 కోట్లు మంజూరు చేయించామని గుర్తుచేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, నాయకులు కొ య్యడి మహిపాల్‌రెడ్డి, కడకుంట్ల నరేశ్, రాకేశ్, షాకీర్, మున్ను, మొబిన్, శ్రీకాంత్, రాజిరెడ్డి, నాగరాజు, అశోక్, భూమయ్య, రాజేశ్, శివ పాల్గొన్నారు.
జాతీయస్థాయి ఖోఖో పోటీలకు రిత్విక
జగిత్యాలరూరల్: సారంగా పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి సీహెచ్.రిత్విక జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై ంది. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని అజ్మీరాలో నిర్వహించే పోటీల్లో రిత్విక ప్రాతినిథ్యం వహిస్తుందని పీడీ రవీందర్ తెలిపారు. రిత్వికను హెచ్‌ఎం కిశోర్, సర్పంచ్ చేకుట అరుణ, మాజీ సర్పంచ్ రాజేందర్‌రెడ్డి, నాయకులు రాంచందర్‌రెడ్డి అభినందించారు.
ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలి
ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలి
ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలి


