ఆస్తి పన్ను వసూలులో కోరుట్లకు ఆరో స్థానం
కోరుట్ల/మెట్‌పల్లి/రాయికల్: ఆస్తి పన్ను వసూలులో కోరుట్ల మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచింది. మార్చి 31 వరకు 89.82 శాతం వసూలు చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో సీడీఎంఏ చేతులమీదుగా మున్సిపల్ కమిషనర్ ఏ.మారుతీప్రసాద్ అవార్డు, ప్రశంస పత్రం అందుకున్నారు. అలాగే పన్ను వసూలులో ప్రతిభ కనబర్చిన మెట్‌పల్లి మున్సిపాలిటీ అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.3.94కోట్లు లక్ష్యంకాగా రూ.3.50 కోట్లు వసూలు చేశారు. కమిషనర్ మోహన్‌కు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి ప్రశంసపత్రం అందించి అభినందించారు. రెండేళ్లుగా 86శాతానికి పైగా వసూలు సాధించినందుకు రాయికల్ మున్సిపాలిటీకి అవార్డు లభించింది. సీడీఎంఏ శ్రీదేవి చేతుల మీదుగా కమిషనర్ మనోహర్ గౌడ్ అవార్డు అందుకున్నారు.
ఆస్తి పన్ను వసూలులో కోరుట్లకు ఆరో స్థానం
ఆస్తి పన్ను వసూలులో కోరుట్లకు ఆరో స్థానం


