ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

Apr 3 2025 1:04 AM | Updated on Apr 3 2025 1:04 AM

ఎల్‌ఆ

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

జగిత్యాల: అనధికారిక లేఔట్లు క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీ గడువును ఈనెల చివరి వరకు పొడిగించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. జిల్లాలోని అర్హులందరూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలన్నారు. రుసుం ఎంతో సెల్‌ఫోన్‌లో తెలుసుకోవచ్చన్నారు. అనధికారిక లేఔట్‌ చేసి, పది శాతం ప్లాట్లు విక్రయించుకున్న వారు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చన్నారు.

ఆయిల్‌ పాం సాగుపై దృష్టి సారించాలి

బుగ్గారం: వరికి ప్రత్యమ్నాయంగా ఆయిల్‌ పాం సాగు చేయాలని ఉద్యానవన శాఖ అధికారి స్వాతి సూచించారు. మండలంలోని చిన్నాపూర్‌, యశ్వంతరావుపేట గ్రామాల్లో బుధవారం వ్యవసాయశాఖ, ఎడిబుల్‌ ఆయిల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో ఆయిల్‌ పాం పంటల సాగుపై అవగాహన కల్పించారు. మండలం ఇప్పటివరకు 300 ఎకరాల్లో ఆయిల్‌ పాం సాగవుతోందని, 90 శాతం సబ్సిడీ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎంఎవో అక్షిత, ఏఈవో శ్రీనివాస్‌, నవీన్‌, కార్యదర్శి సతీష్‌, రాజు తదితరులున్నారు.

ఈఎంటీ సేవలు అభినందనీయం

జగిత్యాల: జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల (ఈఎంటీ) సేవలు అభినందనీయమని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ అన్నారు. బుధవారం జాతీయ ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. 108లో సిబ్బంది చేస్తున్న సేవలు గొప్పవని, క్షతగాత్రులు, గర్భిణులు, ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదాల్లో బాధితులను వెంటనే ఆస్పత్రులకు తీసుకువచ్చి వారి ప్రాణాలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్‌, 108 కో–ఆర్డినేటర్‌ రాము, కుమారస్వామి, భూమేష్‌ తదితరులు ఉన్నారు.

బాధ్యతలు స్వీకరించిన జిల్లా పశువైద్యాధికారి

జగిత్యాల: జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారిగా వేణుగోపాల్‌రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ వెటర్నరీయన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి పూర్ణచందర్‌, గరిగంటి రవి, గణేష్‌, రవీందర్‌, అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఈవోకు సన్మానం

జగిత్యాల: పదో తరగతి పరీక్షలను విజయవంతంగా నిర్వహించినందుకు డీఈవో రామును పీఆర్టీయూ నాయకులు బుధవారం ఘనంగా సత్కరించారు. పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించడం అభినందనీయమన్నా రు. పీఆర్టీయూ అధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి అమరనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు  పొడిగింపు1
1/4

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు  పొడిగింపు2
2/4

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు  పొడిగింపు3
3/4

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు  పొడిగింపు4
4/4

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement