జగిత్యాల: అకాలవర్షాలు, వడగండ్లతో రైతులు పంటలు నష్టపోయినా వారిని ఓ మంత్రి కూడా పరామర్శించలేదని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నా రు. జగిత్యాలలో మంగళవారం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే దాటవేసే ధోరణిలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.58లక్షల కోట్లు అప్పు చేసింద ని, ఇంత స్వల్పకాలంలో అంత అప్పు ఎవరూ చే యలేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎక్కడా జరగలేదన్నారు. ప్రభుత్వం కళ్లు తెరి చి అకాలవర్షాలతో నష్టపోయిన రైతులను పరా మర్శించి వారికి భరోసా కల్పించాలన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థ పాలనలో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే రైతులను ఆదుకోవాలన్నా రు. నాయకులు సతీశ్, గంగాధర్ పాల్గొన్నారు.
సీఎం సహాయనిధిని వినియోగించుకోవాలి
సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురికి సీఎం సహాయనిధి చెక్కులు అందించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.