వసతుల్లేని శ్మశానవాటికలు | - | Sakshi
Sakshi News home page

వసతుల్లేని శ్మశానవాటికలు

Published Wed, Mar 26 2025 12:42 AM | Last Updated on Wed, Mar 26 2025 12:42 AM

వసతుల

వసతుల్లేని శ్మశానవాటికలు

జగిత్యాల: జిల్లాలోని శ్మశాన వాటికల్లో వసతులు లే క ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. శ్మ శాన వాటికల నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీల దే. అయితే అందులో సరైన వసతులు లేకపోవడంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులు స్నానాలు చేసేందుకు.. ఇతరత్రా కార్యక్రమాలు పూర్తిచేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నీటి వసతి లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా తెప్పించుకోవాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. స్నానాలు చేసి న తర్వాత బట్టలు మార్చుకునేందుకు గదులు లేవు.

దోపిడీని అరికట్టేదెలా..?

శ్మశాన వాటికల్లో దోపిడీ అధికమవుతోందని బాధి త కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. దహనానికి విని యోగించే కట్టెలకు టెండర్లు వేసేవారు లేకపోవడంతో అక్కడున్నవారు ఎంత అడిగితే అంతమొత్తం చె ల్లించాల్సి వస్తోంది. కట్టెలకు మున్సిపాలిటీ ద్వారా టెండర్లు పిలిస్తే బాధితులందరికీ ఒకే ధరకు కట్టెలు లభించడంతోపాటు మున్సిపాలిటీకి కూడా ఆదా యం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గదులు లేక ఇబ్బంది

మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు లేని వారి బంధువులు చనిపోతే వారు అద్దెకు ఉండే ఇంటి యజమానులు శవాలను అనుమతించరు. ఇలాంటి వారికోసం శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు పూర్తి చేసి.. అనంతరం జరిగే ఇతరత్రా కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గదులు నిర్మిస్తామని ప్రకటించారు. కానీ.. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. జిల్లాకేంద్రంలో ఒక మోతె శ్మశాన వాటికలో మాత్రం గదులు ఉన్నాయి. మిగతాచోట్ల ఎక్కడా లేవు. 12 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించుకునేలా వసతులు ఏర్పాటు చేస్తే ఇల్లు లేని వారికి ఎంతో మేలుగా ఉంటుందని ప్రజలు అంటున్నారు.

అంత్యక్రియలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు

స్నానాలు చేసేందుకు వేధిస్తున్న నీటి కొరత

నీళ్లు చల్లుకుని ఇంటికి చేరుతున్న బంధువులు

పట్టింపులేని మున్సిపల్‌ అధికారులు

టెండర్లు పిలవాలంటున్న బాధితులు

వైకుంఠదామం పూర్తి చేయాలి

రాయికల్‌ వైకుంఠదామంలో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తరుచూ బోరు రిపేరుకు రావడంతో స్నానాలకు ఇబ్బందికరంగా మారింది. దూరంలో ఉన్న వాగులోకి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి వైకుంఠదామం పూర్తి చేయాలి.

– వెంకటేశ్‌, రాయికల్‌

ఉపయోగంలోకి తేవాలి

ధర్మపురిలో రూ.కోటితో నిర్మించిన శ్మశాన వాటికలో అన్ని వసతులున్నప్పటికీ ఉపయోగంలో లేదు. పూర్తి శిథిలావస్థకు చేరాయి. మున్సిపల్‌ అధికారులు స్పందించి దానిని ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. అధికారులు స్పందించాలి.

– బండారు లక్ష్మణ్‌, ధర్మపురి

గదులు నిర్మించాలి

చాలామంది ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇంట్లో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే ఇంటి యజమానులు శవాన్ని అనుమతించడం లేదు. అలాంటి వారికి అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు గదులు అందుబాటులో ఉంచాలి.

– కిరణ్‌ కుమార్‌, జగిత్యాల

ఈ చిత్రం మెట్‌పల్లిలోని కాపుల శ్మశానవాటిక. ప్రహరీ, బోరు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. శవ దహనం అనంతరం స్నానాలు చేసేందుకు మున్సి పాలిటీ ట్యాంకర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. మెట్‌పల్లిలో 9 శ్మశాన వాటికలు ఉన్నప్పటికీ ముఖ్యంగా నీటి వసతి, స్నానాల గదులు లేకపోవడంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులందరూ ఇబ్బంది పడుతున్నారు. మహిళల పరిస్థితి మరీ వర్ణణాతీతం.

ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని గొల్లపల్లిరోడ్‌లో గల శ్మశాన వాటిక. ఇందులో సక్రమంగా నీరు లేకపోవడంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులకు ఇబ్బందికరంగా మారింది. ఇందులో శవాల దహనానికి వినియోగించే కట్టెలు ఇచ్చేవారు ఎప్పటి నుంచో ఉన్నారు. వారు బాధిత కుటుంబాల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టెండర్లు వేసి ఇవ్వాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలాగే మున్సిపల్‌ ట్యాంకర్‌ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ఇది కోరుట్లలోని శ్మశాన వాటిక. కోరుట్లలో 20 ఉన్నప్పటికీ కొన్ని చోట్లలోనే బాగున్నా యి. మిగతా చోట్ల కనీస వసతులు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కట్టెలు లేకపోవడంతో ఎక్కడెక్కడి నుంచో తేవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇది ధర్మపురిలోని శ్మశాన వాటిక. రూ.కోటితో నిర్మించినప్పటికీ నిరుపయోగంగానే మారింది. వివిధ రకాల గదులు ఏర్పాటు చేసినా బాధ్యతలు ఎవరూ తీసుకోకపోవడంతో పారిశుధ్యం కరువై చెత్తాచెదారంతో నిండిపోయింది. బిగించిన తలుపులు విరిగిపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది.

ఇది రాయికల్‌లో నిర్మించిన వైకుంఠదామం. ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. రూ.కోటి నిధులు మంజూరైనప్పటికీ బర్నింగ్‌ షెడ్డు, ఫుడ్‌ స్టోరేజీ, శివుని విగ్రహం వంటి పనులు పూర్తి కాలేదు. దహన సంస్కారాల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

వసతుల్లేని శ్మశానవాటికలు1
1/8

వసతుల్లేని శ్మశానవాటికలు

వసతుల్లేని శ్మశానవాటికలు2
2/8

వసతుల్లేని శ్మశానవాటికలు

వసతుల్లేని శ్మశానవాటికలు3
3/8

వసతుల్లేని శ్మశానవాటికలు

వసతుల్లేని శ్మశానవాటికలు4
4/8

వసతుల్లేని శ్మశానవాటికలు

వసతుల్లేని శ్మశానవాటికలు5
5/8

వసతుల్లేని శ్మశానవాటికలు

వసతుల్లేని శ్మశానవాటికలు6
6/8

వసతుల్లేని శ్మశానవాటికలు

వసతుల్లేని శ్మశానవాటికలు7
7/8

వసతుల్లేని శ్మశానవాటికలు

వసతుల్లేని శ్మశానవాటికలు8
8/8

వసతుల్లేని శ్మశానవాటికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement