ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. స్వామివారి ఆలయంలో ఈనెల 10 నుంచి 22వరకు వైభవంగా నిర్వహించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 11 రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, సీ్త్రలు బట్టలు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా చెత్తాచెదారం కనిపించకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు.
రూ.98.26 లక్షల ఆదాయం
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి రూ.98.26 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 70 వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, రైస్‌మిల్లర్స్, దాతలు, మున్సిపల్, పోలీస్, ట్రాన్స్‌కో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
11 రోజుల్లో 98.26 లక్షల ఆదాయం