జగిత్యాలజోన్: సామాజిక సేవా కార్యక్రమాలతోనే జీవితానికి సార్థకత చేకూరుతుందని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కంచ ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అనాథ పిల్లల బాలసదన్‌కు జిల్లా లీగల్ ఎయిడ్స్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు శుక్రవారం కూలర్స్ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, సంపాదనే ప్రధానం కారాదని, సేవా కార్యక్రమాలకు సైతం కొంత మొత్తం వెచ్చించి మనస్సుకు ప్రశాంతత చేకూర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కొంతమేరకై నా సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజా భివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఛీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. సతీశ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సి ల్ సభ్యులు ఆర్. విజయకృష్ణ, సీహెచ్.అనురా ధ, జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ నరేశ్, జిల్లా చైల్డ్ వె ల్ఫేర్ అసోసియేషన్ అధికారి హరీశ్ పాల్గొన్నారు.
జిల్లాలో తేలికపాటి వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలక్ష్మి తెలిపారు. ఈనెల 22 నుంచి 26 వరకు తేలికపాటి నుంచి అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 22 నుంచి 24 వరకు జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వాన, ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు వంటివి గంటకు 30– 40 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రత 36–39, రాత్రి ఉష్ణోగ్రత 24–25 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ ఉదయం 51–72 శాతం, మధ్యాహ్నం 13–26 శాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ఆగ్నేయ దిశ నుంచి గాలులు సరాసరి గంటకు 7–10 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన
రాయికల్(జగిత్యాల): ఆయిల్‌పామ్ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఉద్యానవన శాఖ ఏడీ కందుకూరి స్వాతి అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తపేట గ్రామంలో పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు చెట్లకు 90 శాతం సబ్సిడీ, డ్రిప్ పరికరాలకు బీసీ సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకో వాలని కోరారు. మండల వ్యవసాయాధి కారి ముక్తేశ్వర్, ఉద్యానవన శాఖ అధికారి స్వాతి, ఏఈవో సౌందర్య, ఫీల్డ్ ఆఫీసర్ రాజేశ్, మాజీ సర్పంచ్ బత్తిని రాజేశం, రైతులు చింతలపల్లి గంగారెడ్డి, కాటిపల్లి గంగారెడ్డి పాల్గొన్నారు.
బీసీ బిల్లు చరిత్రాత్మకం
కోరుట్ల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం చరిత్రాత్మకమని కోరుట్ల కాంగ్రెస్ సెగ్మెంట్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. శుక్రవారం కోరుట్లలో భారీ బైక్ ర్యాలీ అనంతరం బస్టాండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించి కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ, బీసీ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం గొప్ప విషయమన్నా రు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీసీల కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుందన్నా రు. నాయకులు తిరుమల గంగాధర్, అన్నం అనిల్, పుప్పాల ప్రభాకర్, ఆడెపు మధు, భూంరెడ్డి, గడ్డం వెంకటేశ్‌గౌడ్, మార్కెట్ చైర్మ న్ అంజిరెడ్డి, నయీం, సోగ్రాబీ, సత్యనారాయణ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాలతోనే జీవితానికి సార్థకత
సేవా కార్యక్రమాలతోనే జీవితానికి సార్థకత