ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన అభ్యాస దీపిక విషయ సామగ్రి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ప్రతి భావనను రెండుసార్లు క్షణ్ణంగా చదువుకుని అర్థం చేసుకోవాలి. అవసరమైన చోట పట్టికలు, బొమ్మలు గీసీ భాగాలను తప్పకుండా రాయాలి. జతపర్చడం, తప్పు వాక్యాన్ని గుర్తించడం, వరుసక్రమంలో అమర్చడం. ఫ్లోచార్టులు, బొమ్మలువంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. పర్యావరణం, సాంకేతికత ఆధారంగా ప్రశ్నలు రూపొందిస్తారు. ముఖ్యంగా పట్టికలు నేర్చుకుని ప్రయోగాలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు సాధించే అవకాశముంది. ప్రతి పాఠంలోని అంశాలు, నిర్ధిష్ట శీర్షిక కింద ఇచ్చిన భావనలు, బొమ్మలు, చార్టులు, కృత్యాలను నేర్చుకోవాలి. సెక్షన్ 3లో తప్పకుండా ప్రయోగం వస్తుంది.
– యాళ్ల అమర్‌నాథ్ రెడ్డి, బయాలాజీ టీచర్, జెడ్పీహెచ్‌ఎస్, మల్లన్నపేట