
మాట్లాడుతున్న ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్
● ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్
జగిత్యాలక్రైం: జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల అధికారులు, ఇతర శా ఖల సిబ్బందితో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నామని ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. బుధవారం స్థానిక పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకునేలా చూస్తున్నామని తెలిపారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్‌లు 927 ఉ న్నాయని, ఇందులో సాధారణ కేంద్రాలు 676, స మస్యాత్మక కేంద్రాలు 251గా గుర్తించామని, సమస్యాత్మక కేంద్రాలపై ప్రతిరోజూ నిఘా ఉంచుతున్నామని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
3351 మంది బైండోవర్
గతంలో ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వ్యక్తులతోపాటు సహకరించిన వారిని ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 3351 మందిని బైండోవర్ చేశామని ఎస్పీ తెలిపారు. రౌడీషీటర్లను కూడా ముందస్తుగా బైండోవర్ చేశామన్నారు.
రూ.2.35 కోట్లు స్వాధీనం
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జిల్లాలో చేపట్టిన వాహన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.2,35, 61,331 సీజ్ చేశామన్నారు. అలాగే రూ.24,66, 749 విలువైన 5,230 లీటర్ల లిక్కర్, 3,962 చీరలు, 1,228 టవల్స్, 950 సారిపెట్టికోట్స్, 1,907 వైట్‌షర్ట్స్, 132 హ్యాండ్‌బ్యాగ్స్, 140 హాట్‌బాక్స్, 104 గడియారాలు, 21 షేవింగ్ మిషన్లను సీజ్ చేశామని, వీటి విలువ రూ.1,41,49,846 ఉంటుందన్నారు. జిల్లావ్యాప్తంగా సీజ్ చేసిన నగదు, లిక్కర్, బంగారం, ఇతర వస్తువుల విలువ రూ.4,17,36,140 ఉంటుందన్నారు. జిల్లా సరిహద్దుల్లో తొమ్మిది చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. మొబైల్ చెక్‌పోస్టులతోపాటు వెహికల్ చెకింగ్, నాఖాబందీ చేపడతామన్నారు. జిల్లాలో వ్యక్తిగత రక్షణ కోసం లైసెన్స్ తీసుకున్న 44 ఆయుధాలను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
సోషల్ మీడియాపై నిఘా
ఎన్నికల నేపథ్యంలో సోషల్‌మీడియాపై 24 గంటలపాటు ఐటీ సభ్యులతో కూడిన స్పెషల్ టీంతో నిఘా పెడుతోందన్నారు. విద్వేషాలు, రెచ్చగొట్టేలా, కించపరిచేలా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీకోర్ టీంతో కూడిన స్పెషల్ టీంను నియమించామన్నారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకు గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నడుచుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్తున్నట్లు తెలిస్తే డయల్ 100కుగానీ.. సంబంధిత పోలీస్‌స్టేషన్‌కుగానీ సమాచారం అందించాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడినా.. ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.