అంత్యక్రియల సమయంలో ఊపిరి పీల్చుకున్న మహిళ ..ఆ తర్వాత..

Woman Found Alive After Declared Dead In Body Bag At Funeral Home - Sakshi

అంతక్రియలు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది ఓ వృద్ధ మహిళ. ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా కంగుతిన్న అంత్యక్రియ నిర్వాహకులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆ మహిళ ఆస్పత్రికి తరలించిన ఐదు రోజుల తర్వాత అనుహ్యంగా మరణించింది. 

వివరాల్లోకెళ్తే..అమెరికాలో అయోవా రాష్ట్రంలో 66 ఏళ్ల మహిళను గ్లెన్‌ ఓక్స్‌ అల్జీమర్స్‌ స్పెషల్‌ కేర్‌లో చనిపోయినట్లు ధృవీకరించింది. దీంతో ఆమెను మృతదేహాలు ఉంచే బ్యాగ్‌లో  ప్యాక్‌ చేసి శ్మశానానికి తరలించారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా..అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది సదరు వృద్ధ మహిళ. దీంతో కంగారు పడిన కార్మికులు వెంటనే ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె సజీవంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ కేర్‌ హోమ్‌ సెంటర్‌కు దాదాపు రూ. 8 లక్షలు జరిమానా విధించారు అధికారులు.

అయితే విచారణలో..ఆస్పత్రి సిబ్బంది ఆమె జనవరి 3 నుంచి మహిళ శ్వాస తీసుకోవడం లేదని, పల్స్‌ నమోదు కాలేదని చెప్పారు. ఆ రోజు రాత్రంత సదరు మహిళను నర్సు పర్యవేక్షణలో ఉంచారు. ఐతే వృద్ధురాలి పల్స్‌ రికార్డు కాకపోవడం, శ్వాస తీసుకోకపోవడతోనే ఆమె చనిపోయినట్లు ధృవీకరించినట్లు దర్యాప్తులో తేలింది. అది కూడా ఆమె హెల్త్‌ రిపోర్టు వచ్చిన 90 నిమిషాల తర్వాత మరణించినట్లు ఆస్పత్రి ప్రకటించింది.

కానీ చనిపోయిందని ప్రకటించడానికి చేయాల్సిన తగిన సంరక్షణ సేవలను అందించడంలో సిబ్బంది విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. ఆమె డిసెంబర్‌ 28 నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఐతే ఆమె శ్మాశన వాటికి నుంచి తీసుకువచ్చిన రెండు రోజుల అనంతరం జనవరి 5న ఆమె చికిత్స పొందుతూ  మరణించింది. కానీ ఆ కేర్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డ్రైరెక్టర్‌ లిసా ఈస్టమన్‌ తమ పేషెంట్లను బహు జాగ్రత్తగా పర్యవేక్షిస్తామని వాళ్ల ప్రాణ సంరక్షణకు కావల్సిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిచడానికే తమ సిబ్బంది కట్టుబడి ఉంటారని చెప్పడం గమనార్హం. 

(చదవండి: దొంగతనానికి వచ్చి బాత్‌టబ్‌లో ఎంజాయ్‌!..యజమాని సడెన్‌ ఎంట్రీతో..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top