ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్‌ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది

Woman Buys Lottery Scratch Off By Mistake And Wins 10 Million Dollars - Sakshi

రాత్రికిరాత్రే కోటీశ్వరులు అయిపోతే ఎలా ఉంటుంది? లక్ష్మీ దేవి కరుణించి ఒక్కసారిగా కాసుల వర్షం కురిపిస్తే.. అబ్బా ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా.. మరి అదే నిజమైతే.. మన కాళ్లు భూమ్మీద ఉంటాయా, ఆనందానికి అవధులుంటాయా.. సరిగ్గా ఇలాంటి ఆశ్చర్యకర ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. పొరపాటున తప్పుడు బటన్‌ నొక్కడంతో ఓ మహిళకు ఊహించని అదృష్టం వరించింది. కోట్ల రూపాయలు ఒళ్లో వచ్చిపడ్డాయి. 

వివరాలు.. కాలిఫోర్నియాకు చెందిన లాక్వెడ్రా ఎడ్వర్డ్స్ అనే మహిళ లాటరీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుంది. గత ఏడాది నవంబర్‌లో 40 డాలర్ట విలువైన టికెట్‌ కొనుగోలు చేయాలనుకున్నారు. అయితే అప్పుడే ఓ వ్యక్తి అనుకోకుండా ఆమె మీద పడటంతో మహిళ లాటరీ మెషిన్‌లో తప్పుడు బటన్‌ నొక్కింది. దీంతో మహిళ కొనుగోలు చేయలనుకున్న లాటరీ టికెట్‌కు బదులు వేరే టికెట్‌ వచ్చింది. పైగా దానికి డబ్బులు ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. ఆమెను ఢీకొన్న వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఎడ్వర్డ్స్ ఆమె లాటరీ డబ్బులో 75 శాతం అనుకోకుండా ఒక టిక్కెట్‌కి వెళ్లడంతో పరిస్థితిని చూసి చికాకుపడింది. 
చదవండి: రన్‌వే మీద రెండు ముక్కలైన విమానం.. వీడియో

అయితే ఆమె కోపం ఎక్కువ సేపు నిలవలేదు. జరిగిన పొరపాటుతో ఆమెకు అదృష్టం వరించింది. లాటరీ ఫలితాల్లో టికెట్‌ను స్క్రాచ్‌ చేయగా.. ఆమె 10 మిలియన్ల డాలర్ల(దాదాపు 75 కోట్లు) ప్రైజ్‌ మనీ గెలుచుకున్నట్లు గ్రహించింది.  ముందు ఆ విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది. "నేను మొదట దానిని నిజంగా నమ్మలేదు. కానీ నేను టికెట్ చూస్తూ ఉండిపోయాను. మళ్లీ మళ్లీ చెక్‌ చేసుకున్నాను. నేనింకా షాక్‌లో ఉన్నాను." అని ఎడ్వర్డ్స్ చెప్పింది. నేను ధనవంతురాలిని అయిపోయానని సంబరపడిపోయింది. తనకొచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానని, అందరికీ ఉపయోగపడే విధంగా ఓ సంస్థను ప్రారంభిస్తానని ఎడ్వర్డ్స్ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top