వ్యాక్సినేషన్‌; అదే ఉత్తమమైన మార్గం: డబ్ల్యూహెచ్‌ఓ

WHO Chief Warns Vaccine Nationalism Will Only Prolong Covid 19 - Sakshi

బెర్లిన్‌: కరోనా నిరోధక వ్యాక్సిన్‌ తమ ప్రజలకే ముందుగా అందించాలన్న దేశాల ఆలోచనా విధానం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గేబ్రియేసస్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్‌ను ప్రభావంతంగా ఉపయోగించుకుంటేనే, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లోని ప్రజలందరికీ టీకా అందించడం కంటే కూడా, అన్ని దేశాల్లోని కొంతమంది ప్రజలకు వాక్సినేషన్‌ చేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. రష్యాలో స్పూత్నిక్‌- వీ పేరిట టీకాను విడుదల చేయగా, క్లినికల్‌ ట్రయల్స్‌ తుది దశకు చేరుకున్న క్రమంలో మరికొన్ని కంపెనీలు, త్వరలోనే వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.(చదవండి: నన్ను గెలిపిస్తే అందరికీ ఫ్రీగా వాక్సిన్‌)

ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాలు భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ డోసులు కొనుగోలు చేసి, ప్రజలకు అందించే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే పేద దేశాల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ విషయం గురించి టెడ్రోస్‌ ఆదివారం నాటి సదస్సులో మాట్లాడుతూ.. ‘‘ తమ ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు దేశాలు పోటీపడటం సహజం. అయితే ఇప్పుడు వ్యాక్సిన్‌ను ఎంత ప్రభావంతంగా ఉపయోగించుకోగలమన్న అంశం మీదే కోవిడ్‌-19 వ్యాప్తి ఆధారపడి ఉంటుంది.

వ్యాక్సిన్‌ నేషనలిజం వల్ల మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలే తప్ప, దానిని నియంత్రించే అవకాశం ఉండదు. యూరప్‌ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇలాంటి తరుణంలో, వ్యాక్సిన్‌ను కొన్ని దేశాలకే పరిమితం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ప్రభావంతమైన వ్యాక్సిన్‌ విడుదలైతే, అన్ని దేశాల్లోనూ అది వినియోగంలోకి వచ్చినపుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. (వ్యాక్సిన్ : వారు 2022 వరకు ఆగాల్సిందే!)

అత్యంత తీవ్రమైన సంక్షోభం ఇది: ఐరాస చీఫ్‌
ఇక ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మాట్లాడుతూ.. ‘‘సమకాలీన పరిస్థితుల్లో ఇదే అత్యంత తీవ్రమైన సంక్షోభం. ఇప్పుడు ప్రపంచమంతా అడుగడుగునా కలిసి నుడుస్తూ, సుహృద్భావంతో మెలగాల్సిన ఆవశ్యకత ఉంది. వ్యాక్సిన్లు, కరోనా టెస్టులు, చికిత్సా విధానాలే ఇప్పుడు మన జీవితాన్ని కాపాడే మార్గాలు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి’’అని పేర్కొన్నారు. కాగా శనివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 4,65,319 కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లండించింది. వీటిలో సగం కంటే ఎక్కువ కేసులు యూరప్‌ దేశాల్లో వెలుగుచూసినట్లు వెల్లడించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-12-2020
Dec 04, 2020, 14:22 IST
న్యూఢిల్లీ: మరికొన్ని వారాల్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒక్కసారి శాస్త్రవేత్తల...
04-12-2020
Dec 04, 2020, 13:34 IST
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. భారత్‌లోనూ విజృంభణ కొనసాగిస్తోంది. ఇప్పటికీ గణనీయ...
04-12-2020
Dec 04, 2020, 11:11 IST
రోగనిరోధక శక్తి పెంచుతుంది.. యాంటీ ఆక్సిడెంట్‌, ఇమ్యూనిటీ బూస్టర్‌  అంటూ కరోనా కాలంలో తేనెను తెగ లాగించేస్తున్నారా?
03-12-2020
Dec 03, 2020, 20:27 IST
న్యూయార్క్‌: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు వ్యాక్సిన్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ప్రపంచ దేశాల ప్రజలు ఎదురు చుస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్‌...
03-12-2020
Dec 03, 2020, 17:34 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రపంచ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని తుదముట్టించేందుకు ఏడాది కాలంలోగానే ‘కోవిడ్‌’...
03-12-2020
Dec 03, 2020, 13:32 IST
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో  అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
03-12-2020
Dec 03, 2020, 11:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో  భారతీయులు  బ్రిటన్‌ వెళ్లేందుకు క్యూ కడుతున్నారు....
03-12-2020
Dec 03, 2020, 10:43 IST
ప్రముఖ వ్యాపారవేత్త, పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కార్నే(82) న్యుమోనియాతో మరణించారు.
03-12-2020
Dec 03, 2020, 10:06 IST
సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 53,686 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 609 పాజిటివ్‌ కేసులు...
03-12-2020
Dec 03, 2020, 10:05 IST
రాజస్థాన్‌ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజా, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) కన్నుమూశారు.
03-12-2020
Dec 03, 2020, 04:09 IST
న్యూఢిల్లీ: ఆశలు చిగురిస్తున్నాయి, ఎదురు చూపులు ఫలించనున్నాయి. 2021 వస్తూ వస్తూ మంచి శకునాలు మోసుకురాబోతోంది కరోనా వ్యాక్సిన్‌ వచ్చే...
03-12-2020
Dec 03, 2020, 01:55 IST
సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌లో దసరా.. నవంబర్‌లో దీపావళి.. మరోవైపు చలికాలం.. ఆయా సందర్భాల్లో కరోనా తీవ్రంగా పెరుగుతుందని సర్కార్‌ తీవ్ర...
03-12-2020
Dec 03, 2020, 01:53 IST
లండన్‌: ఫైజర్‌– బయో ఎన్‌ టెక్‌ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు...
03-12-2020
Dec 03, 2020, 00:40 IST
మానవాళి అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ శరవేగంతో అందుబాటులో కొస్తోంది. అందరికన్నా ముందు వ్యాక్సిన్‌ తీసుకొచ్చి అగ్రగాములం...
02-12-2020
Dec 02, 2020, 20:42 IST
మాస్కో: ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ రేసులో ఉన్నాయి. త్వరగా టీకాని తీసుకువచ్చి.. సురక్షితమని నిరూపించి.. ఇతర దేశాలకు...
02-12-2020
Dec 02, 2020, 15:04 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్నిగడగడలాడిస్తోంది. మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు...
02-12-2020
Dec 02, 2020, 13:21 IST
కోవిడ్‌-19 కట్టడికి వచ్చే వారం నుంచీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.
02-12-2020
Dec 02, 2020, 10:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 565 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌...
02-12-2020
Dec 02, 2020, 08:09 IST
గుజరాత్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్  కన్నుమూశారు.
02-12-2020
Dec 02, 2020, 05:26 IST
కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనంత మందికి వ్యాక్సిన్‌ ఇస్తే సరిపోతుందని కేంద్రం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top