కమలా హ్యారిస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

VP Kamala Harris plane forced to return due to technical issue - Sakshi

టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాలకే సాంకేతిక సమస్య 

అప్రమత్తమైన విమాన సిబ్బంది

సురక్షితంగా విమానం ల్యాండింగ్‌

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే అప్రమత్తమైన సిబ్బంది  వెంటనే విమానాన్ని తిరిగి మేరీ ల్యాండ్‌లో ల్యాండ్‌ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందనీ, ఉపాధ్యక్షురాలు మరో విమానంలో బయలుదేరాలని భావిస్తున్నట్లు ప్రతినిధి సిమోన్ సాండర్స్ వెల్లడించారు. ఇది సాంకేతిక సమస్యమాత్రమే. భద్రతా సమస్యలు ఏవీ లేవని సాండర్స్ చెప్పారు. దీంతో  అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  అటు తాము క్షేమంగా ఉన్నామని  కమలా హ్యారిస్  కూడా ప్రకటించారు.

ఉపాధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విదేశీ యాత్రకు బయలుదేరారు.  మేరిల్యాండ్ నుంచి గ్వాటెమాల, మెక్సికో పర్యటన నిమిత్తం ఎయిర్‌ఫోర్స్ 2 లో బయలుదేరారు. అయితే టెకాఫ్ అయిన 25 నిమిషాల తరువాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.దీన్ని గుర్తించిన ఫైలెట్లు.. వెంటనే విమానాన్ని  సురక్షితంగా వెనక్కి  మళ్లించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top