
లండన్: తన భర్త మోసం చేస్తే ఏ మహిళ అయినా ఏం చేస్తుంది. మొబైల్‌తో మెస్సెజ్ లేదా కాల్ చేసి తన కోపాన్ని తీర్చుకుంటుంది. పెద్దలకు దృష్టికి తీసుకువెళుతుంది. కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండి దూరంగా వెళ్ళపోవడమో.. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడమో చేస్తుంది. అయితే యూకేలోని ఓల్డ్ హోమ్‌కు చెందిన ఒక మహిళ తన భర్త చేసిన మోసానికి వెరైటిగా నిరసన తెలిపింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్‌హోమ్‌కు చెందిన ఓ మహిళకు తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. తన భర్త ఫోటోను ఏ4 సైజ్‌లో ప్రింట్ తీయించి గోడలకు అంటించింది. ఆ పోస్టర్ కింద ఇతనొక పెద్ద మోసగాడు అని కూడా రాసింది. చెట్లు, కార్లు వేటిని వదలకుండా అన్నిచోట్ల అతికించి తన కోపాన్ని వెల్లగక్కింది. అంతటితో ఆగకుండా మోసాలకు పాల్పడుతున్న మగాళ్ళను ఉద్దేశించి కూడా మరికొన్ని పోస్టర్లను గోడలకు అతికించింది. ‘మీ భార్యను మోసం చేస్తున్నారా? తొందర్లోనే మీ బండారం బయట పడుతొంది’ అని కామెంట్లు కూడా రాసింది. అయితే భార్యలను ఉద్దేశించి ‘ఈరోజు మీ భర్త మీతోనే ఉన్నాడా? నిన్నరాత్రి? గతవారం కూడా మీతోనే ఉన్నాడా?’ అని రాసి ఉన్న పోస్టర్లను గోడలకు అతికించి ప్రచారం చేసింది.
అయితే గుర్తు తెలియని ఈ మహిళ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఎమిలీ అనే మహిళ కూడా తన లవర్ మోసం చేశాడని అతని గది చుట్టూ ఇటువంటి పోస్టర్లను అతికించి నిరసన తెలిపింది. కాగా, 2019లో ఓ యువకుడు ఏకంగా తనను మోసంచేసిన అమ్మాయి ఫోటోను పట్టుకొని రద్దీగా ఉండే వీధిలో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి తనను మోసం చేసిందని రోడ్డుకెక్కాడు. ఆమెకు తను బ్రేకప్ చెప్తున్నాను అంటూ రోడ్డుపైనే ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా!