విద్యార్థిని మెడపై మోకాలితో నొక్కి, చేతులను కట్టి.. వీడియో వైరల్‌

US Police Kneeling On Minor Student Neck In Wisconsin - Sakshi

వాషింగ్టన్‌: సెక్యూరిటీగా పని చేసే ఆఫ్‌ డ్యూటీ పోలీసు అధికారి పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె మెడపై మెకాలును నొక్కి పెట్టి మైనర్‌ను హింసించాడు. ఈ దారుణ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. విస్కాన్సిన్‌లోని కెనోషా పాఠశాలలో మధ్యాహ్నం లంచ్‌ బ్రేక్‌లో విద్యార్థిని(12) మరో బాలుడితో గొడవ పడుతోంది. అది చూసిన ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి షాన్ గుట్‌షో అక్కడికి వెళ్లాడు. గొడవలో ఆమె ఆపే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆమె సదరు పోలీసులను వెనక్కి నెట్టి వేసింది. తిరిగి లేచిన అతడు విద్యార్థిని అడ్డుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఆవేశంతో ఊగిపోతుండగా.. విద్యార్థిని నియంత్రించే క్రమంలో షాన్ గుట్‌షో దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని స్కూల్‌ యాజమాన్యం విడుదల చేసింది.

విద్యార్థిని కింద పడేసి ఆమె కదలకుండా చేతులు కట్టేసి, ఆమె మెడపై మోకాలితో నొక్కి పెట్టి నియంత్రించాడు. దాదాపు అర నిమిషంపాటు ఇలా మోకాలు ఉంచటంతో విద్యార్థిని గాయపడింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి గుట్‌షోపై క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని బాలిక తండ్రి స్కూల్‌ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ దాడి కారణంగా తన కూతురికి గాయాలు అయ్యాయని పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటన తర్వాత అతడు తన సెక్యూరిటీ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top