గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నాడు

US Man Spends In Jail For Writing Negative Review About Thailand Hotel - Sakshi

హోటల్‌, రెస్టారెంట్లు తమ ఫుడ్‌ ఎలా ఉందో చెప్పాలంటూ అక్కడికి వచ్చే కస్టమర్ల వద్ద రివ్యూలు తీసుకోవడం సహజంగా చూస్తుంటాం. కస్టమర్లు నుంచి వచ్చే సమాధానాలను ఆధారంగా చేసుకొని హోటల్స్‌, రెస్టారెంట్లు మరింత నాణ్యమైన ఫుడ్‌ను అందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ థాయిలాండ్‌లోని ఒక హోటల్‌ మాత్రం ఒక కస్టమర్‌ తమ హోటల్‌పై నెగెటివ్‌ రివ్యూ ఇచ్చినందుకు అతన్ని రెండు రాత్రులు జైలు పాలయ్యేలా చేసింది. (చదవండి : పోలీస్‌ స్టేషన్‌కు అనుకోని అతిథి)

అసలు విషయంలోకి వెళితే.. అమెరికాకు చెందిన వెస్లీ బార్నెస్‌.. థాయిలాండ్‌లో ఇంగ్లీష్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కోహ్‌చాంగ్‌ ఐలాండ్‌లో ఉన్న చాంగ్‌ రిసార్ట్‌కు వచ్చిన బార్నెస్‌ జిన్‌ బాటిల్‌ను తన వెంట తీసుకువచ్చాడు. అయితే దీనికి హోటల్‌ యాజమాన్యం అభ్యంతరం చెబతూ బెర్నాస్‌కు 15 కోర్కేజ్‌ (థాయిలాండ్‌ కరెన్సీ) డాలర్లు జరిమానా విధించింది. హోటల్‌లో ఫుడ్‌ తిన్నాకా బిల్‌ చూసుకొని ఆశ్చర్యానికి గురైన బెర్నాస్‌ తనకు జరిమానా విధించడంపై హోటల్‌ యాజమాన్యంతో గొడవపడ్డాడు. దీంతో మీరు తిన్నదానికి బిల్లు చెల్లించండి చాలు అని బెర్నాస్‌కు సర్దిచెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది.

బెర్నాస్‌ ఇంటికి వెళ్లాకా హోటల్‌ గురించి ఆన్‌లైన్‌ కస్టమర్‌ రివ్యూ రేటింగ్‌లో పనితీరును విమర్శిస్తూ నెగిటివ్‌గా రాసుకొచ్చాడు. అతను చేసిన ఈ పని తన జాబ్‌కు, జీవితానికి ఎసరు పెడుతుందని ఆ క్షణంలో అతనికి తెలియదు. ఈ విషయం తెలుసుకున్న చాంగ్‌ రిసార్ట్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బెర్నాస్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కాగా బెర్నాస్‌పై పరువునష్టం దావాతో పాటు ఒక కంపెనీ తప్పేం లేకున్నా వారిపై నెగెటివ్‌ రాసినందుకు, అలాగే కంప్యూటర్‌ క్రైమ్‌ యాక్ట్‌ ప్రకారం తప్పుడు రివ్యూ ఇచ్చినందుకు అతనిపై కేసు నమోదయింది.

దీంతో బెర్నాస్‌కు రెండు రోజుల జైలు, 3160 కోర్కజ్‌ డాలర్ల జరిమానా విధించారు. ఇకవేళ బెర్నాస్‌ చేసింది తప్పు అని తేలితే రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బెర్నాస్‌ చేసిన పనికి స్కూల్‌ యాజమాన్యం అతన్ని విధుల నుంచి తొలగించింది. అందుకే అంటారు గోటితే పోయేది గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటే ఇదే.. తాను చేసిందే తప్పు అన్న సంగతి తెలిసి కూడా రిసార్ట్‌ వాళ్లతో గొడవపడడమే గాక తిరిగి వారిపైనే నెగెటివ్‌ రివ్యూలు రాసి జైలు పాలయ్యాడు. (చదవండి : తంతే రైలు అయినా వెనక్కి వెళ్లాల్సిందే!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top