వైరల్‌:కెప్టెన్ అమెరికాగా బైడెన్‌, థానోస్‌గా ట్రంప్‌!

US Election Themed Evengers: Endgame Video Goes Viral - Sakshi

వాషిం‍గ్టన్‌: అమెరికా ఎన్నికలు 2020 జరిగి ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జో బైడన్‌ గెలవడం లాంఛనమే అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, ఎడిటర్‌ జాన్‌ హ్యాండెం పియెట్‌ ఒక వీడియోను ఎడిట్‌ చేసి రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ‘ఎవెంజర్స్‌: ఎండ్‌గేమ్’‌ సినిమాలోని పాత్రలను ఎడిట్‌ చేశారు. ఇందులో  బిడెన్‌ను కెప్టెన్ అమెరికాగా, డొనాల్డ్ ట్రంప్‌ను  థానోస్‌గా చూపించారు. ఈ వీడియోలో  బిడెన్‌ ట్రంప్‌కు ఎదురుగా నిలుచున్నట్లు కనిపిస్తాడు.  2019 ఈ చిత్రం క్లైమాక్స్ యుద్ధంలో, కెప్టెన్‌ అమెరికా చూస్తుండగా ఆయనకు మద్దతుగా కొంత మంది వస్తారు. దీనిలో కూడా బైడెన్‌ చూస్తుండగా ఆయనకు మద్దతుగా కమలా హారిస్‌, బరాక్‌ ఒబామా వంటి వారు ఆయనకు సాయాన్ని అందించడానికి వస్తారు.  వారు ఉన్న చోట జార్జియా అని రాసి ఉంటుంది.  ఈ ఎన్నికల్లో జార్జియా రాష్ట్రం ఎంత కీలకమో తెలిసేలా దానిని క్రియేట్‌ చేశారు.  

బైడెన్‌ నడుస్తుండగా ఆయన వెంట కమలా హారిస్‌  ఎగురుకుంటూ వస్తుంది.  ఆమె తరువాత సెనేటర్లు బెర్నీ సాండర్స్, ఎలిజబెత్ వారెన్ , కోరి బుకర్, బెటో ఓ రూర్కే,  పీట్ బుట్టిగెగ్‌లు కలిసి వస్తారు. అంతేకాకుండా ఈ వీడియోలో స్క్వాడ్ సభ్యులు  అయన్నా ప్రెస్లీ, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, రషీదా తలైబ్,  ఇల్హాన్ ఒమర్ ఉన్నారు. హిల్లరీ క్లింటన్, హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కూడా పాపప్‌లో కనిపిస్తారు.  ప్రతి ఓటు కీలకమే అంటూ కొంతమంది సైన్యం వెనకలా నినాదాలు చేస్తూ ఉంటుంది. మొత్తానికి పోటీపోటీగా జరిగిన అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అవుతుంది. సూపర్‌గా ఉందంటూ ఈ వీడియో చూసిన కొందరు కామెంట్‌ చేస్తుంటే, ఈ వీడియో చేసిన వారికి మొక్కాలి అని మరి కొంతమంది ప్రశంసిస్తున్నారు. 

చదవండి: ట్రంప్‌కు మరో తలనొప్పి : వైట్ హౌస్‌ చీఫ్‌కు కరోనా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top