
కిన్షాసా: కాంగో దేశంలో అగ్నిపర్వతం పేలిన ఘటనలో ఇరవైవేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ దేశంలోని గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో డజన్లకొద్దీ ప్రజలు మరణించినట్లు, 40 మంది వరకు తప్పిపోయినట్లు బుధవారం ఐక్యరాజ్యసమితి తెలిపింది. అంతేకాకుండా అగ్నిపర్వత విస్ఫోటనాకి వందలాది గృహాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది అక్కడి నుంచి దూరంగా పారిపోయారని తెలిపారు.
కాగా నైరాగోంగో నుంచి 15 కి.మీ (9 మైళ్ళు) దూరంలో 200 సార్లు భూమి కంపించింది. అయితే ఇప్పటివరకు భూకంపానికి ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. కానీ భూమి కంపించడంతో పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ పగుళ్లు అక్కడి నివాసితులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపారు. కాంగో దేశ అధికారులు పునరావాస సహాయక పనులు చేపట్టారు. అయితే దశాబ్దాలుగా రగులుతున్న ఇరగోంగో అగ్నిపర్వతం బద్దలయ్యే సమయాన్ని అక్కడి యంత్రాంగం అంచానా వేయలేకపోయింది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది.
(చదవండి: ఆకుపచ్చగా మారుతున్న గంగానది.. కారణం ఏంటి?)