Ukraine: న్యూక్లియర్ ప్లాంట్‌ దగ్గర కాలుతున్న10వేల హెక్టార్ల అడవి.. పెను ముప్పు తప్పదా?

Ukraine Warns Forest Fires 100 Hectares Around Chernobyl Nuclear Plant - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. దీనిని ఆపేందుకు పలు దేశాలు ఎన్ని ఆంక్షలు విధించిన వాటిని లెక్కచేయకుండా రష్యా తన దూకుడుని ఏ మాత్రం తగ్గించడం లేదు. అయితే ఈ యుద్ధం కారణంగా సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనే చెప్పాలి. ఇప్పటివరకు జరిగినా వినాశనం ఒకటైతే తాజాగా మరో సంఘటన ఉక్రెయిన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌లో చెర్నోబిల్ అణువిద్యుత్‌ ప్లాంట్‌ కీలకమే కాకుండా పెద్దదనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చెర్నోబిల్‌ జోన్‌ సమీపంలోని 10,000 హెక్టార్లకు పైగా అడవులు కాలిపోతున్నాయని, ఈ మంటలు ప్లాంట్‌ సమీపానికి వచ్చే ప్రమాదం ఉందని ఉక్రేనియన్ అధికారి హెచ్చరించారు. సాధారణంగా చెర్నోబిల్ ప్లాంట్ చూట్టు నాలుగు వేల చదరపు కిలోమీటర్ల వరకు నిషేధిత ప్రాంతం. అంటే ఆ ప్రాంతంలో వాహన సంచారం, ఇతరేతర కార్యక‍్రమాలు ఉండవు. అయితే ఇటీవల రష్యా సైన్యం ఆక్రమించుకోవడంతో వాహన సంచారం ఎక్కువకావడంతో అక్కడి ప్లాంట్‌లోని అణువ్యర్థాలు యాక్టివేట్ అయి ఒక్కసారిగా రేడియేషన్ స్థాయులు పెరిగాయి.

ప్రస్తుతం చెర్నోబిల్‌ సమీపంలో ఉన్న ఈ మంటలు వేడి ప్లాంట్‌ నిషేదిత ప్రాంతంలోకి ప్రవేశించడం ద్వారా అక్కడి వాతావరణం వేడిగా మారడంతో పాటు ప్లాంట్‌లో ఉండే కూలింగ్‌ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల రేడియేషన్‌ పెరుగుతుందని శాస్తవేత్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌ఫాక్స్ ఏజెన్సీ ప్రకారం.. చెర్నోబిల్ పవర్ ప్లాంట్ సమీపంలో కనీసం 31 ప్రాంతాలు అగ్నికి ఆహుతయ్యాయని, దీని ఫలితంగా రేడియోధార్మిక వాయు కాలుష్యం పెరిగి ఉక్రెయిన్‌ దేశంతో పాటు పొరుగున ఉన్న యూరోపియన్ దేశాలకు చేరుకోవచ్చని చెప్పారు. ఇదే జరిగితే పెను ప్రమాదాన్ని చవి చూడాల్సి వస్తుందని, వాటి ఫలితాలు తీవ్రంగా ఉంటాయని అయన అన్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధికారి  డెనిసోవా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

చదవండి: మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్‌ రెస్టారెంట్‌ మూసివేత

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top