రన్‌ వేపై దిగుతూ మరో విమానాన్ని ఢీకొట్టిన ఫ్లైట్‌.. నలుగురు మృతి

Two Small Planes Collided at North Las Vegas Airport 4 died - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని ఉత్తర లాస్‌ వేగస్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. రన్‌వే పై రెండు చిన్న విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో విమానాల్లోని మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం సమయంలో జరిగినట్లు ఫెడరల్‌ ఏవియేషన్‌ అధికారులు తెలిపారు. సింగిల్‌ ఇంజిన్‌ పైపర్‌ పీఏ-46, సింగిల్‌ ఇంజిన్‌ సెస్నా 172లు ఢీకొన్నాయని తెలిపారు. 

'ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింగిల్‌ ఇంజిన్‌ పైపర్‌ పీఏ-46 విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రన్‌ వేపై సెస్నా 172ను ఢీకొట్టింది. దాంతో పైపర్‌ పీఏ 46 రన్‌ వే 30కి తూర్పు వైపు పడిపోయింది. సెస్నా సమీపంలోని నీటి కుంటలో పడింది.' అని ఎఫ్‌ఏఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో విమానంలో ఇద్దరు ఉండగా.. మొత్తం మంది మరణించినట్లు సిటీ అగ్నిమాపక విభాగం తెలిపింది.

ఇదీ చదవండి: America Indiana City: ఇండియానా షాపింగ్‌ మాల్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి.. దుండగుడి హతం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top