Ukrainians 'forcibly deported: దాదాపు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలు రష్యాకు తరలింపు

Two Lakh Childrens Forcibly Deported To Russia A Mid War - Sakshi

2 lakh children among 11 lakh Ukrainians: ఉక్రెయిన్‌ పై రష్యా గత రెండు నెలలకు పైగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ యుద్ధం ఎప్పటికి తెరపడుతుందో అన్నది అర్థం కానీ ప్రశ్నగా మారింది. మరోవైపు ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో  కీవ్‌ దాదాపు రెండు లక్షల మంది పిల్లలతో సహా సుమారు 1.1 మిలియన్లమంది ఉక్రెనియన్లు రష్యాకు బలవంతంగా తరలింపబడ్డారని ఆరోపించింది. ఐతే  ఫిబ్రవరి 24 నుంచి పది లక్షల మంది ఉక్రెనియన్లు బలవంతంగా రష్యాకు బహిష్కరింపబడ్డారని మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

పైగా కీవ్‌ అధికారుల భాగస్వామ్యం లేకుండా ఒక వెయ్యి మంది పిల్లలతో సహా సుమారు 11 వేల మంది సోమవారం ఉక్రెయిన్‌ నుంచి రష్యాలోకి రవాణా చేయబడ్బారని, వారంతా రష్యా మద్దతుతో విడిపోయిన ప్రాంతాలకు చెందిన వారని వెల‍్లడించింది. ప్రజలు తమ స్వంత ఇష్టంతోనే రష్యాకు తరలింపబడ్డారని మాస్కో చెబుతోంది. ఐతే యుద్ధ ప్రారంభమైనపపటి నుంచి మాస్కో వేలాది మందిని బలవంతంగా రష్యాకు బహిష్కరించిందని ఉక్రెయిన్‌ పేర్కొనడం గమనార్హం.

అదీగాక మాస్కో ఉక్రెయిన్‌లోని తన చర్యలను స్పెషల్‌ ఆపరేషన్‌గా సమర్ధించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఐక్యరాజ్యసమితి రెడ్‌క్రాస్ అంతర్జాతీయ కమిటీ ఆపరేషన్‌లో భాగంగా, ముట్టడి చేయబడిన మారిపోల్ ఓడరేవులోని ఒక పెద్ద ఉక్కు కర్మాగారం నుంచి ఖాళీ  చేయబడిన పౌరులు ఉక్రేనియన్ ఆధీనంలో ఉన్న జపోరిజ్జియా నగరానికి చేరుకున్నారు.

(చదవండి: హిట్లర్‌లోనూ యూదుల రక్తం అంటూ.. రష్యా మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ వ్యాఖ్యల దుమారం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top