పేలుళ్లతో దద్దరిల్లిన అఫ్గనిస్తాన్‌

Twin Blasts In Afghanistan's Bamiyan Province Kill 17 - Sakshi

కాబుల్: అత్యంత సురక్షితమైన ప్రావిన్సులలో ఒకటైన బామియాన్ నగరంలో నిన్న (మంగళవారం) జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బామియన్‌లోని స్థానిక మార్కెట్లో పేలుళ్లు సంభవించాయని స్థానిక వార్త సంస్థ టోలో న్యూస్ తెలిపింది. అయితే ఈ పేలుళ్లకు పాల్పడిందెవరో ఇప్పటికి వరకు ప్రకటించలేదు. బామియాన్‌కు  ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇక్కడ పేలుళ్లు జరగటం ఇదే తొలిసారి. జంట పేలుళ్లలో 17మంది మృతి చెందగా, 50మంది గాయపడినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్‌ అరియన్‌ వెల్లడించారు. ఇటీవల జరిగిన దాడుల్లో 50మంది మృతి చెందిన విషయం విదితమే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top