పాపం ట్రంప్‌.. కోర్టులో కూడా ఓటమే

Trump Loses Court Battle in Georgia and Michigan - Sakshi

జార్జియా, మిషిగాన్‌లో ఆధారాలు లేవంటూ కొట్టివేత

వాషింగ్టన్‌: ఇప్పటికే ఓటమి భయంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌కి కోర్టులో కూడా ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్‌ ఇన్‌ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్‌ మద్దతుదారులు ఆరోపిస్తూ.. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జార్జియా, విస్కాన్సిన్‌, పెన్సిల్వేనియా, మిషిగాన్‌ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్‌ చేశారు. ఈ  క్రమంలో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ జార్జియా, మిచిగాన్‌ కోర్టులు ఈ పిటిషన్‌లని పరిగణలోకి తీసుకోలేదు. ఇక నెవాడా మీదనే ట్రంప్‌ ఆశలు పెట్టుకున్నారు. జార్జియా కేసులో, ఆలస్యంగా వచ్చిన 53 బ్యాలెట్లను ఆన్-టైమ్ బ్యాలెట్లతో కలిపినట్లు ట్రంప్‌ మద్దతుదారులు ఆరోపించారు. మిషిగాన్‌లో కూడా ఇదే కారణంతో ఓట్లను లెక్కించకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జార్జియాలోని ఒక ఉన్నత న్యాయమూర్తి జేమ్స్ బాస్ మాట్లాడుతూ, బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి  "ఎలాంటి ఆధారాలు లేవు".. ఈ పిటిషన్‌లని పరిగణలోకి తీసుకోలేం అని తెలిపారు. (చదవండి: ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ దావాలు భ్రమే..!)

మిషిగాన్ కేసులో, న్యాయమూర్తి సింథియా కూడా స్టీఫెన్స్ ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. "యోగ్యతపై విజయం సాధించే అవకాశం ఉందని తెలుసుకోవడానికి నాకు ఎటువంటి ఆధారం లేదు." లాస్ వెగాస్‌తో సహా నెవాడా జనాభా కలిగిన క్లార్క్ కౌంటీలో ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని ట్రంప్ మద్దతుదారులు ఆరోపించారు. ఇక మిచిగాన్, జార్జియా తీర్పులపై  ట్రంప్ ప్రచార ప్రతినిధి స్పందించలేదు. అధ్యక్ష పదవిని నిర్ణయించగలిగే కొన్ని కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్‌ ఇంకా కొనసాగుతుంది. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ నెవాడాలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జార్జియాలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మిడిగాన్‌లో బిడెన్ విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి బైడెన్‌ కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. (చదవండి: చరిత్ర సృష్టించిన జో బైడెన్)

లాస్ వెగాస్‌లో గురువారం ఒక విలేకరుల సమావేశంలో మాజీ నెవాడా అటార్నీ జనరల్ ఆడమ్ లక్సాల్ట్,  ఇతర ట్రంప్ మద్దతుదారులు ముఖ్యంగా మాజీ పరిపాలనా అధికారి రిచర్డ్ గ్రెనెల్‌ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అలానే ఎన్నికల్లో డెమొక్రాట్లు అవకతవకలకు పాల్పడినట్లు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించలేదు. ఇ​క ల​క్సాల్ట్‌ మాట్లాడుతూ.. ‘లెక్కించబడిన ఓట్లలో చనిపోయిన ఓటర్లు ఉన్నారని మేము నమ్ముతున్నాము. మహమ్మారి సమయంలో క్లార్క్ కౌంటీ నుంచి బయటికి వెళ్లిన వేలాది మంది ప్రజల ఓట్లు లెక్కించారని మాకు తెలిసింది” అని తెలిపారు. అంతేకాక "సరికాని ఓట్ల లెక్కింపును ఆపమని" ఆదేశించాల్సిందిగా న్యాయమూర్తిని కోరడానికి ఫెడరల్ కోర్టులో దావా వేస్తామని అన్నారు. క్లార్క్ కౌంటీలోని ఎన్నికల అధికారి జో గ్లోరియా విలేకరులతో మాట్లాడుతూ సరికాని బ్యాలెట్లను ప్రాసెస్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. కోర్టుకు వెళ్తానంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపే అవకాశం లేదని ఎన్నికల న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top