అక్రమ వలసదారులపై ట్రంప్‌ ఉక్కుపాదం.. ఆఫ్రికా దేశాలకు..! | trump administration continues controversial refugee deportation policy | Sakshi
Sakshi News home page

అక్రమ వలసదారులపై ట్రంప్‌ ఉక్కుపాదం.. ఆఫ్రికా దేశాలకు..!

Apr 19 2026 9:25 PM | Updated on Apr 19 2026 9:36 PM

 trump administration continues controversial refugee deportation policy

అమెరికాలోని  అ‍క్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం కొనసాగుతోంది. ఇందులో భాగంగా థర్డ్‌ కంట్రీ ప్రోగ్రామ్‌ కింద లాటిన్‌ అమెరికా దేశాలకు చెందిన వలసదారులను ఆఫ్రికా దేశమైన కాంగోకు తరలించారు. దీనిపై మానవహక్కులు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

వివాదాలకు కేరాఫ్ అడ్రసైన డొనాల్డ్‌ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే  చేసిన మెుదటి పని అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం. వీరు ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో ఉండేది లేదంటు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పలు రకాల పథకాలు ప్రవేశపెట్టి అమెరికా నుంచి వెళ్లాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న లాటిన్ అమెరికా దేశస్థుల కోసం ట్రంప్ ప్రత్యేక ఒప్పందం చేసుకున్నారు.  

ఇందులో భాగంగా 15 మంది వలసదారలతో  కూడిన మెుదటి బృందాన్ని కాంగో రాజధాని కిన్షాసాకు తరలించారు. అక్కడ హోటళ్లలో వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. వీరికి అవసరమైన ఖర్చులను అమెరికా ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపారు. అయితే ఈ తరలింపును మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలే అంతర్యుద్ధం, మానవహక్కుల ఉల్లంఘన తరచుగా జరిగే దేశంలోకి వలసదారులను పంపడమేంటని ప్రశ్నిస్తున్నాయి. 

తమ సొంత దేశం కాని, ఎప్పుడూ చూడని దేశానికి వలసదారులను పంపడం వల్ల వారి భద్రతకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే  రానున్న రోజుల్లో నెలకు సుమారు 50 మంది చొప్పున మరికొంత మందిని కాంగోకు పంపే అవకాశం ఉందని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.

ఏమిటి ఒప్పందం 
అమెరికాలోని లాటిన్ దేశాలకు చెందిన అక్రమ వలసదారులలో తమ స్వదేశాలకు తిరిగివేళ్లేందుకు కోర్టుల ద్వారా రక్షణ పొందిన వారిని తరలించడం కోసం ట్రంప్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కాంగోతో పాటు  ఆఫ్రికాలోని ఇతర దేశాలైన ఘనా, ఉగాండా, రువాండా, దక్షిణ సూడాన్ మరియు ఎస్వాతిని లతో కూడా ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకుంది.

దీనిని "థర్డ్-కంట్రీ డిపోర్టేషన్ అగ్రిమెంట్" గా పిలుస్తారు. ఈ తరలింపులో భాగంగా వలసదారుల వసతికి, భోజనానికి మరియు ఇతర ఖర్చులకు అయ్యే ప్రతి పైసాను అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. ఆశ్రయం ఇచ్చే దేశాలకు ఎటువంటి ఖర్చు ఉండదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement