హర్మూజ్‌లో ఉద్రిక్తత.. మరో ట్యాంకర్‌పై క్షిపణి దాడి | Tensions In Hormuz: Missile Attack On Another Tanker | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌లో ఉద్రిక్తత.. మరో ట్యాంకర్‌పై క్షిపణి దాడి

Jun 27 2026 4:30 PM | Updated on Jun 27 2026 6:00 PM

Tensions In Hormuz: Missile Attack On Another Tanker

హోర్ముజ్ జలసంధిలో కార్గో నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా అమెరికా.. ఇరాన్‌పై దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలు.. కాల్పుల విరమణ ఒప్పందం పరస్పరం ఉల్లంఘనలు వేళ.. మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్రమంలో హర్మూజ్‌లో మరో ట్యాంకర్‌ క్షిపణి దాడికి గురైంది. ఈ జలసంధిలో ప్రయాణిస్తోన్న ట్యాంకర్‌ను క్షిపణి తాకినట్లు వెల్లడించిన యూకే మిలటరీ.. నౌకకు నష్టం వాటిల్లినప్పటికీ సిబ్బంది సురక్షితమని పేర్కొంది.

అయితే, ఈ క్షిపణిని ఎవరు ప్రయోగించారు అనేదానిపై స్పష్టత రాలేదు. హర్మూజ్‌ సమీపంలో అమెరికా, ఇరాన్‌ పరస్పర దాడుల నేపథ్యంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యలకు దిగడంతో ప్రాంతీయ భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి, దానికి అమెరికా చేపట్టిన ప్రతీకార వైమానిక దాడులు, అనంతరం ఇరాన్ స్పందనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ పరిణామాలతో గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను కాపాడడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ జలసంధి గుండా రోజూ లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. అందువల్ల అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement