ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల స్థావరాలపై దాడి.. వందల మంది మృతి | Taliban Continue Attacks On Three Major Cities In Afghanistan | Sakshi
Sakshi News home page

ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల స్థావరాలపై దాడి.. వందల మంది మృతి

Aug 1 2021 3:56 PM | Updated on Aug 3 2021 5:37 PM

Taliban Continue Attacks On Three Major Cities In Afghanistan - Sakshi

కాబూల్: కంధర్ ప్రావిన్స్‌లోని జెరాయ్ జిల్లాలో అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వ రక్షణ దళాలు జరిపిన వైమానిక దాడిలో  పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు.  మరికొందరు గాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. గత 24 గంటల్లో అనేక ప్రధాన నగరాల్లో జరిగిన ఈ ఘటనల్లో కనీసం 250 మంది తిరుగుబాటుదారులు మరణించగా, దాదాపు 100 మంది గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. కాగా తాబిబన్లు ఆప్ఘనిస్తాన్‌లో ఆక్రమించుకున్న గ్రామీణ భూభాగంలో ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా కీలక సరిహద్దు క్రాసింగ్‌లను స్వాధీనం చేసున్నారు. ఆ తరువాత తాలిబన్లు ఉండే ప్రావిన్షియల్ రాజధానులను ముట్టడించారు. ఇక శనివారం రాత్రి తాలిబన్లు కంధర్‌లోని విమానాశ్రయంపై మూడు రాకెట్లను ప్రయోగించారు. దీంతో రన్‌వే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయంపై దాడి, లాజిస్టికల్, ఎయిర్ హెల్ప్ కోసం చాలా ముఖ్యమైన ఈ ప్రాంతాన్ని తాలిబన్ల బారి నుంచి కాపాడుకోవాలనుకున్నారు. ప్రస్తుతం హెల్మాండ్ ప్రావిన్స్‌లోని లష్కర్ గాహ్ దగ్గరగా రెండు వేర్వేరు ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అఫ్గానిస్థాన్‌ అధికారులు వేసవి కాలంలో తాలిబన్ల ఉనికిని పదేపదే తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement