
తైవాన్‌లోని ఓ వైద్య సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద సర్జికల్ ఫేస్ మాస్క్ రూపొందించింది. ఇది ప్రామాణిక ఫేస్ మాస్ కంటే కూడా 50 రెట్లు పెద్దది
world's largest face mask: కరోనా మహమ్మారీ సమయంలో ఫేస్‌మాస్క్‌ల ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం ప్రజలు కూడా తమదైనందిన జీవితంలో ఈ మాస్క్‌లకు అలవాటుపడిపోయారు. ఇది అందరీకి ఒక నిత్యకృత్యంగా మారిపోయింది కూడా. అంతేగాక రకరకాల మాస్క్‌లు కూడా మార్కెట్లలలో దర్శనమిస్తున్నాయి. ఇటీవలే అత్యంత ఖరీదైన మాస్కలు అంటూ బంగారంతో తయారు చేసిన వాటి గురించి విన్నాం. అయితే ఇప్పుడూ వీటన్నింటిని తలదన్నేలా ప్రపంచంలో అతిపెద్ద మాస్క్ ఒకటి తైవాన్‌లో ఉంది. అసలు ఎందుకు తయారు చేశారంటే!..
వివరాల్లోకెళ్తే...ప్రపంచంలోనే అతి పెద్ద సర్జికల్ మాస్క్‌ని తైవాన్‌కి చెందిన ఓ వైద్య సంస్థ రూపొందించింది. ఇది 27 అడుగుల ఎత్తు 3 అంగుళాల 15 అడుగుల వెడల్పు, 9 అంగుళాలు పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పోరేషన్ అనే వైద్య సంస్థ మాస్క్ క్రియేటివ్ హౌస్‌లో ఈ మాస్క్‌ని ఆవిష్కరించింది. ఇది ప్రామాణిక ఫేస్ మాస్ కంటే కూడా 50 రెట్లు పెద్దది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేతలు ఈ రికార్డును ధృవీకరించారు. కోవిడ్ -19 మహమ్మారీ సమయంలో అవగాహన పెంచడం కోసం 2020లోనే ఈ మాస్క్‌ని రూపొందించాలనే ఆలోచన వచ్చిందని మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పొరేషన్ తెలిపింది.