వైరల్‌: స్ప్రింటర్లను మించి కెమెరామెన్‌ పరుగో పరుగు..

Student Cameraman Keeps Pace With Sprinters In China - Sakshi

బీజింగ్‌: మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఉత్తర చైనాలోని షాంకి ప్రావిన్స్‌లోని డాటాంగ్ విశ్వవిద్యాలయంలో పరుగు పందెం పోటీలు నిర్వహించారు. అయితే ఈ 100 మీటర్ల పరుగుపందెం ఈవెంట్‌ను కెమెరాలో బంధించే బాధ్యతను ఓ విద్యార్థికి అప్పగించారు. ఇంకేముంది ఆ విద్యార్థి ఈవెంట్‌ను వీడియో తీయడానికి ఓ 4 కిలోల భారీ కెమెరా గేర్‌ను పట్టుకొని స్ప్రింటర్ల కంటే వేగంగా పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 1.4 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. కెమెరామెన్ ప్రతి ఒక్కరినీ వీడియో తీయడానికి వేగాన్ని తగ్గించాల్సి వచ్చింది, లేకపోతే రాకెట్‌లా దూసుకుపోయేవాడు.’’ అంటూ ప్రశంస జల్లు కురిపించాడు. ఇక మరో నెటిజన్‌ ‘‘ ఆ బహుమతికి కెమెరామెన్‌ అర్హుడు.’’ అంటూ కామెంట్‌ చేశాడు.

(చదవండి: ముంబైలో ఘోర ప్రమాదం.. 8 మంది పిల్లలతో సహా..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top