‘ఆ మందులతో ఎలాంటి ప్రయోజనం లేదు’ | Sakshi
Sakshi News home page

హృద్రోగ నివారణకు ‘స్టాటిన్స్‌’ పనిచేయవు!

Published Tue, Aug 4 2020 2:27 PM

Statins Are Not Effective To Prevent Heart Diseases - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గుండెపోటు నివారణకు ‘స్టాటిన్‌’ ట్యాబ్‌లెట్లను బ్రిటన్‌లోనే కాకుండా భారత్‌లో ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. స్టాటిన్స్‌ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ ఎల్‌డీఎల్‌ను తగ్గించడం వల్ల గుండెపోటు రాకుండా అండుకోగలుగుతుందన్న విశ్వాసమే ఈ మందులను ఎక్కువగా వాడడానికి కారణం. కానీ వాస్తవానికి హృద్రోగులు స్టాటిన్స్‌ తీసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనమేమి కనిపించడం లేదని ‘బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌’ తాజా సంచికలో పేర్కొంది. హృద్రోగులపై స్టాటిన్స్‌ ప్రభావానికి సంబంధించి ఇంతకుముందు నిర్వహించిన 35 అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ఓ వైద్య బృందం ఈ అభిప్రాయానికి వచ్చింది.
(చదవండి: టిక్‌టాక్‌ విక్రయం : చైనా వార్నింగ్?)

స్టాటిన్స్‌ను వాడిన వారిలో మూడొంతుల మంది గుండెపోటు వల్ల మరణించారని, సగానికి సగం మంది రోగుల్లో స్టాటిన్స్‌ గుండెపోటు ప్రమాదాన్ని ఏమాత్రం తగ్గించలేక పోయాయని వైద్య బృందం పేర్కొంది. స్టాటిన్స్‌ ప్రభావంపై తాజాగా అధ్యయనాలు జరపకుండానే, పాత అధ్యయనాలను సరిగ్గా విశ్లేషించకుండానే వైద్యులు సంప్రదాయబద్ధంగా ఇప్పటికీ స్టాటిన్స్‌ ప్రిస్క్రైబ్‌ చేస్తున్నారని వైద్య బృందం అభిప్రాయాలను క్రోడీకరించిన డాక్టర్‌ రాబర్ట్‌ డ్యూబ్రాఫ్‌ తెలిపారు. ఆయన ‘యూనివర్శిటీ ఆఫ్‌ న్యూమెక్సికో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 
(ఫ్లూ టీకాతో ఆ రెండు జబ్బులు తగ్గుదల..)

Advertisement
Advertisement