‘ఉగ్రవాదానికి తావు లేదు’: కొలరాడో దాడిపై శశి థరూర్ | Shashi Tharoor Reacts to Violence at Colorado | Sakshi
Sakshi News home page

‘ఉగ్రవాదానికి తావు లేదు’: కొలరాడో దాడిపై శశి థరూర్

Jun 2 2025 11:21 AM | Updated on Jun 2 2025 12:20 PM

Shashi Tharoor Reacts to Violence at Colorado

న్యూఢ్లిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా విస్తరిస్తున్న ఉగ్రవాదంపై పలు దేశాలకు తెలియజేస్తూ, అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(MP Shashi Tharoor), కొలరాడోలో జరిగిన దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌లో ఉగ్రవాదానికి తావులేదన్నారు.

కొలరాడోలోని బౌల్డర్‌లో జరిగిన ఉగ్ర దాడిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ‘బౌల్డర్‌లో ఈరోజు జరిగిన ఉగ్రదాడి గురించి భారత ఎంపీల ప్రతినిధి బృందం సభ్యులు  తెలుసుకున్నారని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని  తెలియగానే ఉపశమనం పొందామని, ఉగ్రవాదానికి మన దేశాలలో స్థానం లేదు’ అని శశిథరూర్‌ తన ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు. థరూర్ ప్రతినిధి బృందం ప్రస్తుతం బ్రెజిల్‌(Brazil)లో ఉంది. మంగళవారం అమెరికాకు చేరుకోనుంది.
 

కొలరాడోలోని బౌల్డర్ డౌన్‌ టౌన్‌లోని కోర్టు భవనం సమీపంలో మొహమ్మద్ సబ్రీ సోలిమాన్  అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని, ఈ దాడిలో అనుమానితుడు కాక్‌టెయిల్స్, తాత్కాలిక ఫ్లేమ్‌త్రోవర్‌ను ఉపయోగించాడని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు.ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం దాడికి పాల్పడిన వ్యక్తి ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ కేకలు వేశాడు. హమాస్ నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని  కోరుతూ  ‘రన్ ఫర్ దేర్ లైవ్స్’పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుండగా, అక్కడికి సమీపంలోనే ఈ దాడి జరిగిందని యాంటీ-డిఫమేషన్ లీగ్ తెలిపింది.
 

ఇది కూడా చదవండి: ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే..
 

Advertisement
 
Advertisement
Advertisement