పుతిన్‌ తీరుపై రష్యన్ల ఆగ్రహం.. వెక్కివెక్కి ఏడుస్తున్న యువతి.. వీడియో వైరల్‌

Russian Blogger Cries For Her Instagram Will Stop Working - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సైతం సంభవించింది. రష్యా యుద్ధం ఆపాలంటూ ఇప్పటికే పలు దేశాలు హెచ్చరిస్తూ ఆంక్షలను కూడా విధించినా వ్లాదిమిర్‌ పుతిన్‌ మాత్రం అవేవీ పట్టించుకోకుండా దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యాపై పుల్‌ ఫోకస్‌ పెంచి అష్ట దిగ్బంధనం చేస్తున్నాయి. 

అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ సహా ఇతర దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. అటు వీసా, మాస్టర్‌ కార్ట్‌ సైతం తమ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ కూడా రష్యాలో పనిచేయడం లేదు. తాజాగా యూట్యూబ్ కూడా రష్యాకు సర్‌ప్రైజ్‌ షాక్‌ ఇచ్చింది. ​రష్యా ప్రభుత్వానికి చెందిన మీడియా ఛానెళ్లను యూట్యూబ్‌లో బ్లాక్​ చేస్తున్నట్లు సంబంధిత సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపింది. తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తున్నట్లు పేర్కొంది.

మరోవైపు.. ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ ఇన్​స్టాగ్రామ్​పై రష్యా నిషేధం విధించడాన్ని ఆ సంస్థ చీఫ్​ ఆడమ్​ ముస్సేరీ తప్పుపట్టారు. రష్యా చర్య సరికాదని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఈ క్రమంలో రష్యాకు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో తన బ్లాగ్‌ పనిచేయడం లేదని వెక్కివెక్కి ఏడ్చింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top