ఉక్రెయిన్‌ దాడితో రష్యా పోర్టులో మంటలు | Russia Reports Fire in Strike on Major Baltic Port | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ దాడితో రష్యా పోర్టులో మంటలు

Mar 30 2026 5:42 AM | Updated on Mar 30 2026 5:42 AM

Russia Reports Fire in Strike on Major Baltic Port

మాస్కో: రష్యాలోని అతి పెద్ద పెట్రోలియం ఎగుమతుల కేంద్రం  ఉస్ట్‌–లుగా నౌకాశ్రయంపై శనివారం ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి జరిపింది. పోర్టులో భారీగా మంటలు చెలరేగాయని, తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ పోర్టుపై బుధవారం కూడా ఉక్రెయిన్‌ దాడి జరిపింది.

రష్యా కీలక ఆదాయ వనరులైన ఇంధన వ్యవస్థలపై ఉక్రెయిన్‌ వరుసగా దాడులు చేస్తోంది. నల్ల సముద్ర తీరంలోని నొవొరొస్సియాస్క్, ప్రిమోర్‌స్క్‌ పోర్టులపై దాడులతో అక్కడి నుంచి రష్యా ఇంధన వనరుల ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా రష్యా ఎంతో కీలకంగా ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement