ప్రింటేసి.. తుడిచేసి..  ఒకే పేపర్‌పై మళ్లీ మళ్లీ ప్రింటింగ్‌! 

Reap Company Created Deprinter That Removes Ink From Paper - Sakshi

సాధారణంగా ప్రింటర్‌లో ఏమైనా ప్రింట్‌ చేశామంటే.. ఆ కాగితాలను అవసరం ఉన్నంతసే పు ఉంచేయడం.. ఆ తర్వాత పడేయడమే.. కానీ కా గితాలపై ఇంకును తుడిచేస్తూ.. మళ్లీ మళ్లీ వాడుకోగలిగితే!? ఈ ఐడియా చాలా బాగుంది కదా.. అటు పర్యావరణాన్ని పరిరక్షించినట్టూ ఉంటుంది, ఇటు ఖర్చూ తగ్గుతుంది. పైగా తరచూ కాగితాలు తెచ్చుకోవడం దగ్గరి నుంచి వాటిని పడేయడం దా కా ఎంతో శ్రమ కూడా తప్పుతుంది.

ఈ క్రమంలోనే రీప్‌ సంస్థ.. కాగితాలపై ఇంకును తుడిచేసే ‘డీప్రింటర్‌’ను రూపొందించింది. అంటే ప్రింటర్‌ ఇంకును ముద్రిస్తే.. ఈ డీ ప్రింటర్‌ ఆ ఇంకును తుడిచేసి మళ్లీ తెల్ల కాగితాలను ఇచ్చేస్తుంది. ఈ టెక్నాలజీకి ‘రీప్‌ సర్క్యులర్‌ ప్రింట్‌ (ఆర్‌సీపీ)’ అని పేరు పెట్టారు. 

ప్రత్యేకమైన పేపర్‌.. లేజర్‌ క్లీనర్‌తో.. 
డీప్రింటింగ్‌ టెక్నాలజీని వినియోగించాలంటే.. అందుకోసం కాస్త మార్పులు చేసిన ప్రత్యేకమైన పేపర్‌ను వినియోగించాల్సి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. ఈ పేపర్‌ను ప్రింటర్‌లో వినియోగించినప్పుడు ఇంకు పూర్తిగా లోపలివరకు ఇంకిపోకుండా.. పైపొరల్లోనే ముద్రితం అవుతుంది. తర్వాత ఈ పేపర్లను ‘డీ ప్రింటర్‌’లో పెట్టినప్పుడు.. దానిలోని ప్రత్యేకమైన లేజర్‌ ఇంకును ఆవిరి చేసేస్తుంది.

దీనితో తెల్ల కాగితం బయటికి వస్తుంది. ఈ సాంకేతికతతో ఒక్కో పేపర్‌ను 10 సార్లు వాడుకోవచ్చట. అంటే  కాగితం తయారీ కోసం చెట్లను నరకడం 90% తగ్గిపోతుందని కంపెనీ చెబుతోంది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top