ఖతర్‌ మధ్యవర్తిత్వం

Qatar in talks with Hamas, Israel to swap hostages for prisoners - Sakshi

దోహా: ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య బందీల మారి్పడికి, వీలైతే పోరుకు తెర దించేందుకు ఖతర్‌ రంగంలోకి దిగింది. హమాస్‌ చెరపట్టిన మహిళలు, పిల్లలను విడిపించేందుకు ముందుకొచి్చంది. బదులుగా ఇజ్రాయెలీ జైళ్లలో బందీలుగా ఉన్న 36 మంది మహిళలు, పిల్లలను విడుదల చేయాలని ప్రతిపాదించింది.

దీనిపై ఇప్పటికే హమాస్‌ తో మాట్లాడుతున్నట్టు ఖతర్‌ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ విషయంలో అమెరికా సాయం కూడా తీసుకుంటున్నట్టు చెప్పింది. ‘‘చర్చల్లో పురోగతి ఉంది. పోరుకు తెర పడి శాంతి నెలకొనాలని, బందీలు విడుదల కావాలని మా ప్రయత్నం’’ అని వివరించింది. ఇజ్రాయెల్‌ మాత్రం ఈ విషయంలో ఎలాంటి సంప్రదింపులూ జరగడం లేదని పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top