హిరోషిమా అణుబాంబు విషయమై పుతిన్‌ కీలక వ్యాఖ్యలు... షాక్‌లో ఫ్రాన్స్‌

Putins Reference To Atomic Bombings In Japan Chat With Macron - Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో సంభాషించారు. ఆ సంభాషణలో జపాన్‌ అణుబాంబు దాడుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. పుతిన్‌ మరోసారి అణుదాడుల గురించి సంభాషించడం దిగ్భ్రాంతి గురి చేసిందని యూకే స్థానిక మీడియా డైలిమెయిల్‌ పేర్కొంది. అదీగాక పుతిన్‌ అవసరమైతే ఉక్రెయిన్‌పై వ్యూహాత్మక అణుదాడులు చేస్తానంటూ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌తో పుతిన్‌ సంభాషిస్తూ...1945లో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా తన మొదటి అణుబాంబును వేసిన మూడు రోజుల తర్వాత యూఎస్‌ జపాన్‌లోని నాగసాకిని లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని పునురుద్ఘాటించారు. జపాన్‌ లొంగిపోయేలా రెండో ప్రపంచ యుద్ధం ముగిసేలా జరిపిన బాంబు దాడులు గురించి మాట్లాడారు.

అలాగే తాము గెలవాలంటే ప్రధాన నగరాలపై దాడిచేయాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా అణు దాడికి రెడీ అనే సంకేతాన్ని ఇచ్చారు. అంతేగాదు మాక్రాన్‌తో పుతిన్‌ కీవ్‌ని వదిలేసి తూర్పు ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక అణుదాడి చేసే అవకాశం ఉందనే సంకేతం ఇచ్చారని డెయిల్‌ మెయిల్‌ పేర్కొంది. కానీ రష్యా పదేపదే తన నియంత్రణలో ఉ‍్నన ఖేర్సన్‌ ప్రాంతంపై డర్టీ బాంబు ప్రయోగించనుందంటూ ఆరోపణలు చేస్తోంది. ఐతే ఉక్రెయిన్‌ విదేశంగ మంత్రి డిమిట్రో కులేబా రష్యా తాను చేస్తున్న కుట్రని ఇతరులు చేస్తున్నట్లుగా చిత్రీకరించడం అలవాటు అంటూ మండిపడ్డారు.

(చదవండి: దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్‌ పౌరుల తరలింపు)
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top