Manny Pacquiao: ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష బరిలో బాక్సర్‌ పకియావ్‌

Philippine Presidential Run Manny Pacquiao Announced He Contest In Election - Sakshi

మనీలా: ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష పదవికి వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో బరిలో ఉంటానని ఆ దేశ బాక్సింగ్‌ దిగ్గజం, సెనేటర్‌ మానీ పకియావ్‌(42) ప్రకటించారు. ఆదివారం జరిగిన పీడీపీ–లబన్‌ పార్టీ సమావేశంలో పకియావ్‌ పేరును ఒక వర్గం నేతలు ప్రతిపాదించగా ఆయన అందుకు సమ్మతించారు. ప్రభుత్వ మార్పు కోసం వేచి చూస్తున్న ఫిలిపినో ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘నేనొక యోధుడిని. బరిలోనూ వెలుపల యోధుడిగానే ఎల్లప్పుడూ ఉంటాను’ అని పేర్కొన్నారు.

అధికార పీడీపీ–లబన్‌లోని ఒక వర్గానికి పకియావ్, సెనేటర్‌ అక్విలినో నాయకత్వం వహిస్తున్నారు. పార్టీలోని మరో వర్గం, ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు డుటెర్టెని ఉపాధ్యక్షుడిగా, సెనేటర్‌ బాంగ్‌ గోను అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్‌ చేసింది. బాక్సింగ్‌లోని ఎనిమిది వేర్వేరు విభాగాల్లో ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక బాక్సర్‌గా పకియావ్‌ చరిత్ర సృష్టించారు.   

చదవండి: 

షాకింగ్‌: పార్కింగ్‌ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్‌

Tokyo Olympics: ముఖానికి 13 కుట్లు.. అయినా సరే పోరాటం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top