Panama Migrant Bus Crash: ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి

Panama Migrant Bus Crash Accident Increasing Death Toll - Sakshi

దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పనామాలో అమెరికాకు వలస వెళ్లే వారిని తీసుకెళ్తున్న బస్సు.. మరో మినీ బస్సును ఢీకొట్టింది. చిరికీలోని గ్వాలకాలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృత్యువాతపడినట్లు పనామా జాతీయ వలసదారుల డైరెక్టర్‌ సమీరా గోజైన్‌  బుధవారం తెలిపారు.

ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌, అతని సహాయకుడితోసహా మొత్తం 66 మంది ఉన్నారు. రాజధాని పనామా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చిరీకి ప్రావిన్స్‌‌ రాజధాని నగరం డేవిడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది. క్షతగాత్రుల సంఖ్యను, మృతుల వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. తొలుత 15 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మృతుల సంఖ్య 39కు పెరిగింది.

కొలంబియా సరిహద్దులోని అడవి ప్రాంతం అయిన డేరియన్ నుంచి వలసదారులతో బస్సు బయల్దేరింది. వీరంతా పనామా, కోస్టా రికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో గుండా చివరికి యునైటెడ్ స్టేట్స్‌కు ప్రయాణిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top