పాకిస్థాన్ వక్రబుద్ధి మరోసారి బట్టబయలైంది. అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌ను టార్గెట్‌గా చేసుకునే ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ తన భూభాగంలో ఆశ్రయం కల్పిస్తోందని నివేదిక తెలిపింది.
పాకిస్థాన్ తీరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్ధాల కాలంగా ఆదేశం భారత్‌పై విషం చిమ్మూతూనే ఉంది. మనం దేశం పైకి దాడి చేయడానికి పరోక్షంగా ఉగ్రమూకలకు మద్ధతిచ్చి భారత్‌పైకి ఊసిగొల్పడం ఆ దేశానికి సాధారణ విషయమే. తాజాగా అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ సర్వేలోని ఇవే అంశాలు వెల్లడయ్యాయి.
2008 ముంబై దాడులకు కారణమైన లష్కరే ఏ తోయిబా, 2001 భారత పార్లమెంటు దాడికి పాల్పడిన జైషే మహమ్మద్ వంటి సంస్థలు ఇప్పటికీ పాక్ భూభాగం నుండి పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. గత పదకొండేళ్లుగా ఆ దేశంలో ఉగ్రవాదం ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకుందని తెలిపింది. 2019లో 365గా ఉన్న మరణాల సంఖ్య, 2025 నాటికి 4,001కి చేరుకుంది. ఇది గత 11 ఏళ్లలో ఇదే అత్యధికమంది.
ఆ దేశంలో ఐదు రకాలైన ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని వాటిలో పాకిస్థాన్ ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకరమైన సంస్థగా తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) నిలిచిందని పేర్కొంది. వీరు పాక్ ప్రభుత్వాన్ని పడగొట్టి షరియా చట్టాన్ని అమలు చేయాలని చూస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం అమెరికా పాక్‌తో అంటగాచుకొని తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆదేశానికి చెందిన ఏజెన్సీ రిపోర్టు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కాగా ఇటీవల టెర్రరిజం గ్లోబల్ ఇండెక్స్ ప్రచురించిన నివేదికలోనూ పాక్ మెుదటి స్థానంలో నిలిచింది. CRS అనేది అమెరికా కాంగ్రెస్ సభ్యులకు సమాచారం అందించే స్వతంత్ర పరిశోధనా విభాగం. దీని నివేదికలను అమెరికా ప్రభుత్వ అధికారిక నిర్ణయాలుగా పరిగణించలేము, కానీ ఇవి విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయి.


