కోవిషీల్డ్‌కు యూకే ఓకే!

No quarantine for fully vaccinated Indians travelling to UK from October 11 - Sakshi

ప్రయాణ నిబంధనలపై వెనక్కుతగ్గిన బ్రిటన్‌

అక్టోబర్‌ 11 తర్వాత క్వారంటైన్‌ అక్కర్లేదు

భారతీయ ప్రయాణికులకు ఊరట

లండన్‌: కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నా సరే భారత్‌ నుంచి బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది. వ్యాక్సిన్‌ అర్హత ఉన్న దేశాల జాబితాలో భారత్‌ పేరును చేర్చింది. తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్‌ 11 నుంచి యూకే వచ్చే భారత ప్రయాణికులు కోవిïÙల్డ్‌(లేదా బ్రిటన్‌ అనుమతించిన ఏదైనా టీకా) పూర్తి డోసులు తీసుకున్నట్లైతే క్వారంటైన్‌ తప్పనిసరి కాదు.

భారత్, పాక్‌తో కలిపి 37 దేశాల పేర్లను వ్యాక్సిన్‌ అర్హత ఉన్న దేశాల జాబితాలో యూకే చేర్చింది. వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న యూకే పౌరులతో సమానంగా ఈ దేశాల నుంచి వచ్చే అర్హులైన ప్రయాణికులను(టీకా డోసులు పూర్తి చేసుకున్నవారు) పరిగణిస్తారు. సదరు ప్రయాణికులు బ్రిటన్‌ ప్రయాణానికి పదిరోజుల ముందు యూకే ప్రకటించిన రెడ్‌ లిస్ట్‌ జాబితాలోని దేశాలను సందర్శించి ఉండకూడదు.

అలాగే ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందు నిరి్ధష్ట టీకా డోసులు పూర్తి చేసుకొని ఉండాలి. వీరికి క్వారంటైన్‌ మినహాయింపుతో పాటు యూకేలో కాలుమోపాక చేసే తప్పనిసరి టెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుంది. భారత టీకా సరి్టఫికేషన్‌ను యూకే అక్టోబర్‌ 11 నుంచి గుర్తించనుందని, ఇరు దేశాల మంత్రిత్వశాఖల చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని బ్రిటీష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ తెలిపారు. ఈ అంశంపై నెలరోజులుగా సహకారమందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top