కుప్పకూలిన నాటో విమానం.. ‘ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతో సంబంధం లేదు’

NATO Drill In Norway Four US Soldiers Died Aircraft Crash - Sakshi

హెల్సింకీ: నార్వేలో ఆర్కిటిక్‌ సర్కిల్‌లో కోల్డ్‌ రెస్పాన్స్‌ పేరిట ‘నాటో’ దేశాలు నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమెరికా నావికా దళానికి చెందిన ఎంవీ–22బీ ఓస్ప్రే ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలింది. ఇందులో ఉన్న నలుగురు అమెరికా నావికాదళం సైనికులు మృత్యువాత పడ్డారు. ఉత్తర నార్వేలోని నార్డ్‌ల్యాండ్‌ కౌంటీలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన జరిగింది.

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి ఈ సంఘటనతో సంబంధం లేదని నార్వే ప్రధానమంత్రి జోనాస్‌ గెహర్‌ స్టొయిరీ, రక్షణ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ప్రతికూల వాతావరణం వల్లే అమెరికా విమానం కూలిపోయిందని నార్వే పోలీసులు వెల్లడించారు. ఈసారి నాటో సైనిక విన్యాసాల్లో 27 దేశాలకు చెందిన 30 వేల మంది సైనికులు, 220 విమానాలు, 50 నౌకలు పాల్గొంటున్నాయి. నాటోయేతర దేశాలైన ఫిన్‌ల్యాండ్, స్వీడన్‌ కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి. ఇవి ఏప్రిల్‌ 1న ముగియనున్నాయి. 
(చదవండి: ఉక్రెయిన్‌పై ‘అణు’ ఖడ్గం!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top