అంగారకుడిపై సూర్యకిరణాలు.. ఇదే తొలిసారి!

NASA Curiosity rover spots sun rays on Mars for the first time - Sakshi

వాషింగ్టన్‌: ఫొటోలో కనిపిస్తున్నవేమిటో తెలుసా? అంగారకునిపై కనువిందు చేస్తున్న సూర్య కిరణాలు. కుజ గ్రహంపై సూర్య కిరణాలు మన కంటపడటం ఇదే తొలిసారి! మార్స్‌పై పరిశోధనలు చేస్తున్న క్యూరియాసిటీ రోవర్‌ తాజాగా వీటిని తన కెమెరాలో బంధించింది.

దిగంతాల మీదుగా సూర్యుడు అస్తమిస్తున్న క్రమంలో మేఘాలన్నింటినీ ప్రకాశవంతం చేస్తున్న తీరును ఫొటోలో గమనించవచ్చు. కుజునిపై మేఘాలు ఉపరితలానికి 60 కిలోమీటర్ల ఎత్తున నీరు, మంచుతో కూడి ఉన్నాయని నాసా అంచనా. కుజ గ్రహాన్ని వాసయోగ్యం చేసుకుని అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు కేంద్రంగా మార్చుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో అక్కడి వాతావరణం, దాని కూర్పు, ఇతర స్థితిగతులను తెలుసుకోవడానికి దాని మేఘాలను విశ్లేషించడం కీలకం. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top