మార్స్‌పై గతంలో జీవం! | Nasa Confirms Perseverance Rover Discovered Signs Of Life On Mars, Check Post Inside | Sakshi
Sakshi News home page

మార్స్‌పై గతంలో జీవం!

Sep 11 2025 8:42 AM | Updated on Sep 11 2025 10:40 AM

Nasa confirms Perseverance rover discovered signs of life on Mars

మరింత బలమైన ఆధారాలను గుర్తించిన నాసా రోవర్‌

కేప్‌ కనావెరల్‌(యూఎస్‌): అంగారకునిపై కోట్ల సంవత్సరాల క్రితం జీవం మనుగడ ఉండేదన్న వాదనలకు మరింత బలం చేకూరేలా అక్కడి నాసా ‘పర్సివరెన్స్‌’రోవర్‌ ఒక శిలాజం ఆనవాళ్లను గుర్తించింది. వందల కోట్ల సంవత్సరాల క్రితం ప్రవహించి ఎండిపోయిన ఒక నది ఒడ్డున ఉన్న ఒక శిలపై ప్రత్యేకమైన గుర్తులను పర్సివరెన్స్‌ రోవర్‌ కనిపెట్టింది.

భూమి మీద మాత్రమే కనిపించే కొన్ని ప్రత్యేక మూలకాల రసాయన, భౌతిక చర్యల కలయికగా ఏర్పడే ‘లెపర్డ్‌స్పాట్స్‌’ ను అక్కడ గుర్తించారు. ఆ గుర్తుల్లో అధిక ఇనుప ధాతువు జాడలున్నాయి. నీటి పీల్చుకున్న ఐరన్‌ ఫాస్ఫేట్‌(వివియనైట్‌), గ్రెగైట్‌(ఐరన్‌ సల్పైడ్‌)లను దానిపై కనిపెట్టారు. శిథిలమైన కర్భన పదార్థాల్లో వివియనైట్‌ ఉంటుంది. అలాగే చిన్నపాటి జీవులు సైతం గ్రెగైట్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఈ లెక్కన ప్రాచీన జీవికి సంబంధించిన జాడగా ఈ ‘లెపర్ట్‌ స్పాట్‌’ను భావించవచ్చని నాసా తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్‌ సీన్‌ డఫీ వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement