White Lung Syndrome: విస్తరిస్తున్న మిస్టీరియస్‌ న్యుమోనియా: ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్?

Mysterious Pneumonia Outbrea Similar To China White Lung Syndrome - Sakshi

ప్రపంచవ్యాప్తంగా అంతుచిక్కని బ్యాక్టీరియల్ న్యుమోనియా వ్యాప్తి ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇటీవల చైనాలో ఆందోళన రేపిన చిన్నపిల్లలో న్యుమోనియా కేసులు తరహాలోనే  ముఖ్యంగా అమెరికా మసాచుసెట్స్  ఒహియోలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున​ట్టు  నివేదికల ద్వారా తెలుస్తోంది.

వైట్ లంగ్ సిండ్రోమ్‌గా పిలుస్తున్న శ్వాసకోశ వ్యాధి ప్రధానంగా  పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. మూడునుంచి ఎనిదేళ్ల వయస్సున్న పిల్లల్లోఈ న్యుమోనియా వ్యాపిస్తోంది. దీనికి కచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రానప్పటికీ  ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లకు సాధారణ బాక్టీరియా మైకోప్లాస్మానే కారణం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.

వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది ప్రభావితమైన పిల్లలలో ఛాతీ ఎక్స్-కిరణాలపై విలక్షణమైన తెల్లటిపొరలా ఏర్పడుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత పరిస్థితులులాంటి పలు శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి.శ్వాస ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం , అలసట లాంటివి ప్రధాన లక్షణాలు.

అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) అనేది ఊపిరితిత్తుల్లో నీరు చేరినపుడు  సంభవించే తీవ్ర పరిస్థితి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. న్యుమోనియా, సెప్సిస్ , ట్రామా వంటి అనేక కారణాల వల్ల ARDS సంభవించవచ్చు. ఊపిరితిత్తుల అల్వియోలార్ మైక్రోలిథియాసిస్ (PAM) అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులలో కాల్షియం పేరుకుపోవడం సంభవించే అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి. దీనివల్ల ఊపిరి ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి వస్తుంది.

సిలికోసిస్ అనేది సిలికా ధూళిని పీల్చడం వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి. సిలికా దుమ్ము ఇసుక, రాయి, ఇతర ఇతర పదార్థాలలో కనిపిస్తుంది. సిలికోసిస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మరియు ఛాతీ నొప్పికి కారణమవుతుంది.

మూల కారణం
వైట్ లంగ్ సిండ్రోమ్  మూలకారణాలు ఏంటి అనేది ఇంకా పరిశోధనలోఉంది.  అయితే ఇది బాక్టీరియా, వైరల్ , పర్యావరణ కారకాల కలయిక వల్ల వస్తోందనేది అంచనా. ఇన్ఫ్లుఎంజా లేదా COVID-19 వంటి వైరస్‌లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం ద్వారా తెల్ల ఊపిరితిత్తుల సిండ్రోమ్‌ను కలిగిస్తాయి. మైకోప్లాస్మా న్యుమోనియా వంటి బాక్టీరియా, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగించడం ద్వారా వైట్ లంగ్ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు. సిలికా ధూళి, ఇతర కాలుష్య కారకాలను పీల్చడం వంటి పర్యావరణ కారకాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ద్వారా  వైట్ లంగ్ సిండ్రోమ్‌ వ్యాధి వస్తోంది. దీంతో మరో కోవిడ్‌-19 మహమ్మారి విస్తరిస్తోందా అనే ఆందోళన నెలకొంది. 

దీనికి చికిత్స వ్యాధి తీవ్రత, రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్, కార్టికో స్టెరాయిడ్స్ ద్వారా చికిత్సగా భావిస్తున్నారు.  చైనాలో  శ్వాసకోశ  వ్యాధుల వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో చైనా పొరుగు దేశాలైన తైవాన్, నేపాల్ , అధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా వైట్ లంగ్ సిండ్రోమ్' వ్యాప్తి
అమెరికాకు ముందు నెదర్లాండ్స్ , డెన్మార్క్ కూడా న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి.  వీటిలో చాలా వరకు మైకోప్లాస్మా కారణంగా భావిస్తున్నారు.ప్రతి  లక్షమంది పిల్లలలో 80 మంది న్యుమోనియా సోకింది. నాలుగు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కేసులు కూడా పెరుగుతున్నాయి. న్యుమోనియా కేసులు 'అంటువ్యాధి' స్థాయికి చేరుకున్నాయని డానిష్ ఆరోగ్య ముఖ్యులు కూడా  ప్రకటించారు.  గత ఐదు వారాల్లో ఈ సంఖ్య  మూడు రెట్లు పెరిగిందని డెన్మార్క్ స్టాటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ (SSI)  వెల్లడించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top