జో బైడెన్‌తో జెలెన్‌స్కీ భేటీ.. భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన అమెరికా | More U.S. military aid to Ukraine will aggravate conflict | Sakshi
Sakshi News home page

జో బైడెన్‌తో జెలెన్‌స్కీ భేటీ.. భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన అమెరికా

Published Thu, Dec 22 2022 4:35 AM | Last Updated on Thu, Dec 22 2022 7:41 AM

More U.S. military aid to Ukraine will aggravate conflict - Sakshi

వాషింగ్టన్‌:   ఉక్రెయిన్‌కు అమెరికా మరో భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించింది. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేయనుంది. ఇందులో ఒక బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలు, 800 మిలియన్‌ డాలర్ల నిధులున్నాయి. పేట్రియాట్‌ క్షిపణులు, ఉక్రెయిన్‌ యుద్ధ విమానాల కోసం అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్‌ బాంబులను తొలిసారిగా ఉక్రెయిన్‌కు ఇవ్వనుంది.

ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేస్తోంది. డ్రోన్లు ప్రయోగిస్తోంది. వాటిని తిప్పికొట్టడానికే కొత్త ఆయుధాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బుధవారం అమెరికాకు చేరుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత జెలెన్‌స్కీ మరో దేశంలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే తొలిసారి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement